సంక్షేమ పధకాలు ప్రజలకు అందాయా లేదా ప్రజల నుండి తెలుసుకోవడమే గడపగడపకు… : మంత్రి డాక్టర్ తానేటి వనిత

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే తమని ప్రజల మధ్య కి తీసుకుని ఉన్నాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మంత్రి మమేకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల మధ్య మేము వెళుతుంటే ప్రజలు స్వాగతం పడుతున్నారని ప్రతిపక్షాలు ఇది చూసి ఓర్వలేక మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారన్నారు. మళ్లీ ఎప్పుడే ఎన్నికలు వస్తాయి, మన జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం అన్న తపన తో ప్రజలు ఉన్నారన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రజలు నీరాజనాలు పట్టడం ఎంతో ఆనందాన్ని ఇస్తొందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయిందని ఈ మూడు సంవత్సరాల్లో జగనన్న ప్రజలకు ఏమి చేశారు అన్నది ప్రజల నుంచి తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని వాటిలో ఎన్ని అమలు చేశారు ఇంకా ఏమి చేయాలి అని అని తెలుసుకోవడం జరిగిందన్నారు. ధర్మవరం గ్రామంలో ప్రతి గడప కి వెళ్లడం జరుగుతోందని ప్రతి గడపలు ఏదో ఒక ప్రభుత్వ సంక్షేమ లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నారన్నారు. ఒకటి కాదు రెండు కాదు 3 అంతకు మించి ప్రభుత్వ అ సంక్షేమ పథకాల ప్రయోజనం పొందుతున్న ఎన్నో కుటుంబాలు ఉన్నాయన్నారు అందులో ఎటువంటి అతిశయోక్తి లేదని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. తమ తోబుట్టువులు తమ కడుపున పుట్టిన బిడ్డలు కూడా డబ్బు సహాయం చేయడానికి రాకున్నా జగనన్న ప్రతి కుటుంబానికి వేలల్లో లక్షల్లో ప్రయోజనాన్ని అందించి ఒక అన్నగా అండగా నిలిచారని లబ్ధిదారులు పేర్కొనడం చూశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు ప్రజలకు అందాయా లేదా ప్రజల నుండి తెలుసుకోవడమే గడపగడపకు మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. ఇంకా ఏమైనా ప్రజల సమస్యలు ఉంటే తక్షణ మే తీర్చేందుకు అధికారులతో ప్రతీ గడప, గడప కు తిరుగడం జరుగుతొందన్నారు. కొవ్వూరు ఆర్డీఓ, ఎస్. మల్లిబాబు, డ్వామా పి. డి., పి.జగదాంబ, యం. పి. పి. కాకర్ల నారాయణుడు, మునిసిపల్ ఛైర్ పర్సన్, బావన రత్నకుమారి, జెడ్. పి. టి. సి, బి. వెంకటలక్ష్మి, మండల తాహిసీల్దార్, బి. నాగ రాజు నాయక్, ఎంపిటిసిలు, స ర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతిని ధులు, వివిధ శాఖల డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికా రులు, నియోజకవర్గం లోని నాయకులు పాల్గొన్నా రు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *