దావోస్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో తొలి రోజున బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. హాన్స్‌పాల్ బక్నర్. బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ మాట్లాడుతూ విద్య, వైద్య ఆరోగ్యం రంగాలతో పాటు, రాష్ట్రంలో తగిన మౌలిక వసతుల కల్పన, వివిధ సంస్థల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న చొరవ, ఆ దిశలో చిత్తశుద్ధితో చేస్తున్న కృషి తప్పనిసరిగా సానుకూల ఫలితాలనిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు సమకూరుతాయి. తద్వారా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని నేను భావిస్తున్నాను. ఏ రాష్ట్రమైనా అన్ని రంగాలలో పురోగమించాలంటే, ఎంతో అభివృద్ధి సాధించాలంటే మంచి విద్య, మంచి ఆరోగ్యం, ఆహార భద్రత.. ఈ మూడు చాలా ముఖ్యం. ఇవి దీర్ఘకాల ప్రయోజనాలనిస్తాయి. వాటి మీదనే అన్నీ ఆధారపడి ఉంటాయని చెప్చొచ్చు. ఉన్నత విద్య, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతారు. అవి లేకపోతే ఏమీ సాధించలేము. మనం గొప్పగా విమానాశ్రయాలు నిర్మించుకోవచ్చు. అలాగే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వాటికి కావాల్సింది మానవ వనరులే కదా. మంచి విద్యావంతులు, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారు లేకపోతే వాటినెలా నడపగలం. అందుకే ఆ దిశలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.