-నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విధులు పట్ల నిబద్ధత, అంకితభావం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో డిటిపి ఆపరేటర్లకు నియామక పత్రాలు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్రి మంగా దేవి, గుంటూరు భీమ సూర్య ప్రకాష్ లను అభినందించారు. కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న వికాస్ కేంద్రం ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, రాజమండ్రి నందు ఖాళీగా ఉన్న రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులలో వీరిని నియమించడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి నందు పనిచేశామని వారు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విధుల్లో అంకితభావంతో పనిచేయడమే కాకుండా నిబద్దత, సేవా భావం కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వొచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.