రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని గోదావరి బండ్ ను పర్యాటక ప్రదేశంగా రూ.15 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం క్షేత్ర స్థాయి పర్యటన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం గౌతమిఘాట్, సరస్వతి ఘాట్ ప్రాంతాల్లో , గోదావరిలో మునిసిపల్ కమిషనర్ ఇతర అధికారులతో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక ప్రత్యేకత ను తీసుకుని రావడానికి ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధి కోసం రూ. 125 కోట్లతో పనులు చేపట్టే దిశలో అడుగులు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అందులో భాగంగానే గోదావరి తీరం లోని గౌతమీ ఘాట్ ప్రాంతంలో రివర్ బండ్ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా సరస్వతి ఘాట్ ప్రాంతంలో మరో రూ 5 కోట్ల తో అభివృద్ధి పనులు కోసం నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. ఈనగరం ఆధ్యాత్మిక కేంద్రం, సాంస్కృతిక ప్రభావం కలిగిన ప్రాంతం గా విశేషమైన గుర్తింపు పొందినదని తెలిపారు. అనంతరం గోదావరి నది లో లాంచ్ ద్వారా పర్యటించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయి లో సద్వినియోగం చేసుకోవాలని, అదే సమయంలో పనుల విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఈ ఈ పాండురంగ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …