రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెండవ బోర్డు మీటింగు సందర్భంగా బోర్డు ఏజెండా అంశాలపై చర్చించి మాస్టరు ప్లాను యొక్క పురోగతి గురించి, వాటిపై వస్తున్న ఫిర్యాదులపైచర్చించినట్లు రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా , రాజమహేంద్రవరం గౌ ॥ ఛైర్ పర్సన్ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుడా రెండవ బోర్డ్ మీటింగ్ రుడా మీటింగ్ హాలునందు నిర్వహించినారు. ఈ సందర్భంగా రుడా చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, మీటింగు నందు మొదటి బోర్డు మీటింగులో జరిగినటువంటి అంశాలపై చర్య నివేదినను సభ్యులకు వివరించడం జరిగిందన్నారు. రుడా పరిధిలో చేపట్టే నిర్మాణాలు, మార్గదర్శకాల మేరకు అనుమతి పొందిన లే అవుట్ లలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. రుడా అభివృద్ధి లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా ఏజెండా అంశాలను గురించి వివరిస్తూ మాస్టరు ప్లాను యొక్క పురోగతి గురించి, వాటిపై వస్తున్న ఫిర్యాదులపై చర్చించారు. రుడా పరిధిలోని, రుడా చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని గ్రామాలను రుడా పరిధిలో కలపాలని ఆ ప్రాంత ప్రజల నుండి మరియు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు , రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ నుంచి అభ్యర్ధనలు వచ్చాయన్నారు. వాటిని కూడా పరిగణంలోకి తీసుకోవాలని బోర్డుమెంబర్స్ తో సమావేశం లో చర్చించామన్నారు. రుడాలోని అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ, రుడాలో మొట్ట మొదటి డెవలప్మెంట్ వర్క్ ” జగన్ అన్న ఉమెన్ సేఫ్ హేవేన్ ” అనే పేరుతో ఆడపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారికి షెల్టర్లను, సెక్యూరిటీని, టాయిలెట్లను ఎ.టి.ఎమ్ లను జగన్ అన్న ఉమెన్ సేఫ్ హేవేన్ అభివృద్ధి పని ద్వారా కల్పించినామని చైర్ పర్సన్ తెలియచేసినారు.రుడా ఆధ్వర్యం లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలనుంచివొచ్చే పిర్యధులను, విజ్ఞప్తులను స్వీకరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చైర్ పర్సన్ పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో రుడా ద్వారా నగర సుందరీకరణ లో భాగంగా ప్రజలసౌకర్యం కోసం మొక్కల పెంపకం, డివైడర్ ల , నగరపరిధిలో పార్కుల అభివృద్ధి తదితర పనులను చేపట్టడం జరుగుతుందని రూడా వైస్ చైర్మన్, నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. రూడా ఏర్పాటు చేసి 9 నెలలు పూర్తి అవుతుందని, తొలి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు , కార్యాలయ నిర్వహణ కోసం పరిపాలనాపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై ర్యాటిఫికేషన్ ను సభ్యుల ఆమోదం పొందడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం రాష్ట్ర రాజధానికి దగ్గరా ఉండడంతో ఈ జిల్లా నుంచే జాతీయ, రాష్ట్ర హై వే రహదారులు వెళ్ళడం ఈ నగరానికి ఎంతో ప్రాముఖ్యత పెరిగిందన్నారు. రూడా గురించి ప్రతి ఒక్కరికీ తెలియచేసెలా బడ్జెట్ ఫ్రెండ్లీ విధానంలో లే అవుట్ లను పరి నశీలించడం, తగిన అనుమతులు మంజూరు చేయాలనే విధానంలో ముందుకూ వెళ్ళడం జరుగుతున్నట్లు తెలిపారు. లే అవుట్ వివరాలు ఎంతో పారదర్శకంగా వెబ్ సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా లే అవుట్ లో స్థలం కొనాలనుకునే వారు ఖచ్చితంగా ఆమోదించ బడిన ప్లాన్ ను అడగాలన్నారు.
భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిర్ణయాలు తీసుకున్న అంశాల వారీగా 1) రుడా పరిధిలోని నియోజకవర్గాల వారిగా పార్కులను, బస్ షెల్టర్లను, టాయిలెట్లున్ను నిర్మించుట 2) రూడా పరిధిలో డైరక్షన్ బోర్డులను ఏర్పాటు చేయుట 3) రుడా పరిధిలో ప్లాన్ టేషన్ పాట్స్ ఏర్పాటు చేయుట 4) థీమ్ పార్క్, చిల్డ్రన్ పార్కులు నిర్మించుట 5) రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద లేడిస్ డ్రెస్ చేంజింగ్ రూమ్, ఆర్.ఒ. ప్లాంట్లు ఏర్పాటు చేయుట 6) గతంలో చేపట్టిన కంబాల చెరువు మ్యూజికల్ ఫౌంటైన్ ను విస్తరించి పార్కు అభివృద్ధి చేయుట వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశానికి రీజనల్ డిప్యూటి డైరక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ , రాజమహేంద్రం , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ & బి , సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ , ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ , రీజనల్ డైరక్టర్ టూరిజం డిపార్టుమెంట్, జనరల్ మేనేజర్, డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ . ఎ.పి.పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, రుడా సెక్రటరీ శైలజావల్లి , రుడా ప్లానింగ్ ఆఫీసర్ టి.జి.రామ్మోహన్ తదితర అధికారులు హాజరైనారు.
Prajavartha Online Telugu News