-గోదావరి మిషన్ కార్యక్రమానికి శ్రీకారం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రాన్ని సుందర నగరం గా తీర్చి దిద్దడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం లేకుండా సాధ్యం కాదని, స్వీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పిలుపు నిచ్చారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుష్కర్ ఘాట్ నందు మిషన్ గోదావరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, వృక్షో రక్షిత రక్షితః నినాదంతో ఇప్పటి వరకూ ప్రతి ఏటా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నారు. అయితే ప్రతి ఏడాది వేడి పెరుగుతూ వస్తోందన్నారు. నగర ప్రజలు అదృష్టవంతులు జీవ నది ఒడ్డున ఉంటున్నారు. నగర్ కాలుష్యానికి మనమే అంటే ప్రజలుగా భాధ్యత అని పేర్కొన్నారు. నేచర్ ను కాపాడడం లో ప్రభుత్వ అధికారులు, వ్యవస్థ సరిపోదని ప్రజలు భాగస్వామ్యం తో సాధ్యం అవుతుందన్నారు. ప్రజా ప్రతినిదులు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రాన్ని, గోదావరి ఘాట్ లను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చి దిద్దడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
విశిష్ట అతిథి , పార్లమెంట్ సభ్యులు మార్ఘని భరత్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జరుపుకుంటున్న రోజున మనం ఒక నిర్ణయం తీసుకోవాలసి ఉందని అన్నారు. క్లీన్ సిటీ గా రాజమహేంద్రవరం ను తీర్చి దిద్దడంలో 80 శాతం ప్రజల భాగస్వామ్యం ఉంటుంది.
రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ కాలుష్యాన్ని గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు పై సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. మిషన్ గోదావరి కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని అభిలాష వ్యక్తం చేశారు. నగరంలో ఎన్నో పనులు చేపట్టడానికి అవకాశం ఉందని, నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ నగరంగా తీర్చి దిద్దడంలో అడుగులు వెద్దా మన్నరు. నిధులు తీసుకుని రావడానికి కృషి చేస్తానని, పనులు పూర్తి చేసే అధికారులు చేపట్టాలని పేర్కొన్నారు.
మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఈరోజు ఎంతో ప్రతిష్ఠత్మకమైన రోజు అన్నారు. మనకి ఉన్నది ఒకే భూమి అనే నినాదంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నా మన్నారు. గత రెండు దశాబ్దాలుగా వాతావరణం లో వేడి పెరుగుతోందన్నారు. మరొక్క డిగ్రీ వేడి పెరిగినా ఎంతో ప్రమాద భరితంగా మరే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. గోదావరి నది ఎంతో పవిత్రమైనది గా , పుణ్య క్షేత్రం గా పేరుపొందిన దృష్ట్యా నది పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలు రైస్ బోల్ ఆఫ్ ఇండియా గా పేరుపొందిన గోదావరి నది జలాలు పరిరక్షణకు చేయి చేయి కలిపి గోదావరి మిషన్ ను ప్రారంభించడం జరుగుతోందన్నారు.
గోదావరి క్లీనింగ్ స్కిమ్మర్ యంత్ర పరికరం తో గోదావరి ఘాట్ పరిహర ప్రాంతాలను శుభ్రపరచడం జరుగుతుంది. కార్యక్రమం లో భాగంగా తొలుత లోగో ఆవిష్కరణ, ఏ వి ని ప్రదర్శించిన తదుపరి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రుడా చైర్ పర్సన్ మేకపాటి షర్మిలా రెడ్డి, ఈ ఈ పాండురంగ రావు, రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి టి కే. విశ్వేశ్వర రెడ్డి, పలు స్వచ్చంధ సంస్థలు, ఆర్ ఎం సి శానిటేషన్ సిబ్బంది , ప్రజలు పాల్గొన్నారు.