విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి ఎండల్లో సుగంధి నీటిని తాగడం వల్ల 40కి పైగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. ఆంజనేయ దాసు అన్నారు. విజయవాడ మ్యూజియం రోడ్ లో గల దాస్ ఆటో సర్వీసింగ్ సెంటర్ నందు వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు గత 40 రోజుల నుంచి ప్రతిరోజు బాటసారులకు సుగంధ వాటర్ ను అందిస్తున్నారు. సుగంధ వాటర్ ప్రత్యేకత వివరిస్తూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయిందని ఆయన అన్నారు. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు సుగంధి వాటర్ తాగడం వల్ల బాడీలో రిలీజయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నిటినీ వాటర్ సాల్యుబుల్ కెమికల్ గా మార్చేందుకు ఈ యాంటీ యాక్సిడెంట్స్ బాగా పని చేస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా లివర్ను యాక్టివ్ చేసి యూరిన్ ద్వారా 80 నుంచి 90 శాతం బయటకు పోయేటట్లు చేస్తుందన్నారు. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు హైడ్రేట్ చేయడానికి ఈ సుగంధ వేర్లు బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, ఇతర సీపీఎం నాయకులు, టూవీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …