వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చే విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి చలివేంద్రం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి ఎండల్లో సుగంధి నీటిని తాగడం వల్ల 40కి పైగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని విజయవాడ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. ఆంజనేయ దాసు అన్నారు. విజయవాడ మ్యూజియం రోడ్ లో గల దాస్ ఆటో సర్వీసింగ్ సెంటర్ నందు వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు గత 40 రోజుల నుంచి ప్రతిరోజు బాటసారులకు సుగంధ వాటర్ ను అందిస్తున్నారు.  సుగంధ వాటర్ ప్రత్యేకత వివరిస్తూ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయిందని ఆయన అన్నారు. ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు సుగంధి వాటర్ తాగడం వల్ల బాడీలో రిలీజయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నిటినీ వాటర్ సాల్యుబుల్ కెమికల్ గా మార్చేందుకు ఈ యాంటీ యాక్సిడెంట్స్ బాగా పని చేస్తాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా లివర్ను యాక్టివ్ చేసి యూరిన్ ద్వారా 80 నుంచి 90 శాతం బయటకు పోయేటట్లు చేస్తుందన్నారు.  బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు హైడ్రేట్ చేయడానికి ఈ సుగంధ వేర్లు బాగా ఉపయోగపడతాయన్నారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, ఇతర సీపీఎం  నాయకులు,  టూవీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *