-DEOs & District Collectors, EROs కార్యాలయాలు, EVMs గిడ్డంగులు, పి.ఎస్.ల వద్ద నేడు ప్లాంటేషన్ ప్రోగ్రాం
-ఎన్నికల కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్నినిర్ణీత కాలంలో నియంత్రిస్తాం
-గ్రీన్ ప్రొటోకాల్ క్రింద ప్లాస్టిక్ను, నాన్-సస్టైనబుల్ ఐటెమ్స్ ని నియంత్రిస్తూ భవిష్యత్లో ఎన్నికలు
-సచివాలయంలో మొక్కలు నాటిన సి.ఇ.ఓ. ముకేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అందరి సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని, నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా ఆదివారం అమరావతి సచివాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని భారత ఎన్నిక సంఘం గత నెల 26 వ తేదీన నిర్వహించిన వీడియో కాన్పరెన్సులో ఆదేశాలు జారీచేశిందన్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (DEOs), ఎన్నికల నమోదు అధికారులు (EROs) కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVMs) గిడ్డంగులు మరియు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
అదే విధంగా ఎన్నికల కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్నినిర్ణీత కాలంలో నియంత్రించేందుకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రీన్ ప్రొటోకాల్ క్రింద ప్లాస్టిక్ను, నాన్-సస్టైనబుల్ ఐటెమ్స్ ని నియంత్రిస్తూ భవిష్యత్లో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
డిప్యుటీ సి.ఇ.ఓ. వెంకటేశ్వరరావు, మల్లికార్జున్ రెడ్డి, SVEEP కన్సల్టెంట్, ఎస్.ఓ. కొండారెడ్డి తదితరులతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ సిబ్బంది అంతా ఈ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.