మత్స్యకారుల జీవన స్థితి గతులు పూర్తిగా మార్పుచేసే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది…

-కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో మత్స్యకారుల జీవన స్థితిగతులు పూర్తిగా మార్పుచేసే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మత్స్యసంపద యోజనా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో విప్లవాత్మకమార్పులు వచ్చాయని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆదివారం, జిల్లా రూరల్ మండలం మునసబ్ పేట గ్రామంలో గురజాడ విద్యాలయములో ఏర్పాటు చేసిన ‘మత్స్యకార ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమంలో డాక్టర్ మురుగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తీరప్రాంతాన్ని ఆధారంగా చేసికొని జీవనం సాగిస్తున్న గంగపుత్రుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆత్మనిర్బర్భారత్లో భాగంగా ప్రధానమంత్రి మత్స్యసంపద అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. గడిచిన 8 ఏళ్లలో 32 వేలకోట్లరూపాయలు మత్స్యకారుల సంక్షేమానికి కేటాయించామని అన్నారు. బడుగు, బలహీన వర్గ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొనే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. నేషనల్ ఫిషరీస్ డెవలపమెంట్ బోర్డు ద్వారా అత్యధిక శాతం నిధులు కేటాయిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దేశంలో 2020-22 మధ్య కాలంలో మత్స్యసంపద ఎగుమతులు గణనీయంగా పెరిగాయని దేశాభివృద్ధిలో మత్స్యశాఖ ప్రధాన భూమిక పోషిస్తోందని డాక్టర్ మురుగన్ పేర్కొన్నారు.  ప్రమాదంలోమరణించిన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్సగ్రేషియా అందిస్తూ కేంద్రం వారిని ఆదుకుంటోందని అన్నారు. మత్స్యకారుల నివాస ప్రాంతాల్లోమౌలిక వసతుల అభివృద్ధికి 7500 కోట్ల రూపాయలుప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు.మత్స్యకారులను ఎస్.టి.జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తీరప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని,తీరాన్ని రక్షించుకోవటం అందరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *