-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం సింగ్ నగర్ ప్రాంతములోని బర్మా కాలనీ రోడ్, హెచ్.టి లైన్ రోడ్, సంతోషిమాత గుడి రోడ్ లలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ శుభ్రపరచు పనులను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి “నాలా మెన్” ద్వారా డ్రెయిన్స్ నందలి సిల్ట్ తొలగించు పనులను పర్యవేక్షించిన సందర్భంలో మురుగునీటి పారుదలకు అడ్డంకిగా ఉన్న వ్యర్ధములను తొలగించుటకు వీలు లేకుండా డ్రెయిన్ల పై అనధికార ఆక్రమణలు ఉండుట గమనించి డ్రెయిన్లు శుభ్రపరచుటకు అవకాశం లేకుండా డ్రెయిన్లపై గల ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో డ్రెయిన్ శుభ్రపరచునట్లుగా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా కాలువ అంచుల వెంబడి పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని మరియు రోడ్ అంచుల వెంబడి గల వ్యర్ధములు అన్నియు తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, శానిటరీ అధికారులు మరియు శానిటరీ సెక్రెటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News