-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కై కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ డి ఆర్ వో సుబ్బారావు, బ్రహ్మ కుమారీస్ గ్రామీణాభివృద్ధి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ మానవుని మనుగడకు ప్రాణవాయువు ఎంతో కీలకమన్నారు. అటువంటి ప్రాణదారమైన వాయువును అందించే వృక్ష సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మాణానికి కృషి చేయాలన్నారు. పరిసరాలను పరిరక్షించనపై అవగాహన తో పాటు చెట్లను నాటడం, తోటలను పునర్నిర్మించడం, నదులను శుభ్రపరచడం ద్వారా మన పర్యావరణాన్ని కాపాడకోగలమన్నారు.