Breaking News

మంగళగిరి లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
సైన్యం నియామకంలో అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మంగళగిరి లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌పై యువత నిరసనలు చేపడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ పథకం పై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు తమ వైఖరి ప్రజలకు వెల్లడించాలి. ఈ పథకాన్ని రద్దు చేయాలని జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ప్రధానికి బహిరంగ లేఖలు రాయాలి. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని, పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. అగ్నిపథ్ పథకాన్ని దేశం మొత్తం వ్యతిరేకిస్తోందన్నారు. ప్రధాని మోదీ తన మాయ మాటలతో యువతను మోసం‌ చేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా ఆపాలన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.

జై జవాన్, జై కిసాన్‌ బదులు నై జవాన్, నై కిసాన్‌ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే సైన్యంలో సర్వీసు నాలుగేళ్లే అంటున్నారని, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కును అమ్మేసిందని శైలజనాథ్ మండిపడ్డారు. భారత సైన్యాన్ని ప్రైవేటీకరించే దిశగానే మోడీ ప్రభుత్వం అగ్నిపథ్‌ ప్రవేశపెడుతోందని విమర్శించారు. దేశ సేవ, భద్రత కోసం పనిచేసే వారికి భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. త్రివిధ దళాల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఆది నుంచి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయన్నారు. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేరి నాలుగేళ్ల తర్వాత రిటైరైన సైనికులకు తాము చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాయా? లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు పెదవి విప్పలేదన్నారు. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలాంటి స్పష్టత లేదని, దీంతో అగ్నివీరులుగా చేసిన వారి భవిష్యత్తు ఏంటనేది అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు.

సాయుధ బలగాల్లో అగ్నిపథ్ పథకం కింద చేరే యువకుల భవిష్యత్​ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్వీసు పూర్తయిన నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రకటించగా, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నాయని శైలజనాథ్ పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో సైనిక తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఆందోళనలు ఆగట్లేదని, ఈ పథకం కింద సైన్యంలో చేరే సైనికుల భవిష్యత్​పై భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయని శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *