Breaking News

జిల్లాలో 22 మినీ ఫిష్ వెండరింగ్ యూనిట్లు ఏర్పాటు

-యూనిట్ ఖరీదు ఒకక్కొంటికి రూ.3.50 లక్షలు
-జిల్లాలో 2022-23 ఆర్థిక సంత్సరానికి రూ.3.62 కోట్లతో వార్షిక ప్రణాళిక కు ఆమోదం
-కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించేందుకు, సాంప్రదాయ మత్స్య అనుబంధ రంగాల్లో ఉండేవారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ మాధవి లత స్పష్టం చేశారు.

సోమవారం కలెక్టర్ ఛాంబర్లో పి ఎం ఎం ఎస్ వై జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో మత్స్య అనుబంధ రంగాలను అభివృద్ధి చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రస్థాయి ఆమోదానికి పంపవలసి ఉందన్నారు. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరం కు రూ.3.62 కోట్లతో వార్షిక ప్రణాళిక కు ఆమోదం తెలపడం జరిగిందన్నారు . రాష్ట్ర స్థాయి కమిటీ కి నివేదిక అందజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పాల్గొని పథకాన్ని సమర్థంగా అమలు, పర్యవేక్షణ చేయడం పై జిల్లాస్థాయి కమిటీ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పి ఎం ఎం ఎస్ వై కింద వ్యక్తిగత, బృంద (group) లబ్ధిదారుల ఎంపిక కోసం మరింతగా ప్రచారం చేయాలన్నారు. పి ఎం ఎం ఎస్ వై కింద బీసీ ఎస్సీ తదితర కేటగిరిలలో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను కం సబ్సిడీలను ప్రజలకు వివరించాలన్నారు. అనుగుణంగా బ్యాంకు లింకేజీ సౌకర్యం కూడా అందజేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా అడుగులు వేయాలన్నారు.

మిశ్రమ చేపల పెంపకం యూనిట్స్ కాస్ట్ రూ.4 లక్షలతో 10 యూనిట్స్, బహిరంగ నీటి వనరులలో పెన్ కల్చర్ యూనిట్ రూ.3 లక్షలతో ఒక యూనిట్, మంచు పెట్టెతో మోటార్ సైకిల్ యూనిట్ ఖరీదు రూ.75 వేలు తో 50 యూనిట్స్, ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రాలు యూనిట్ ఖరీదు రూ.20 లక్షలుగా 10 యూనిట్స్, జీవనోపాధి యూనిట్లు యూనిట్ ఖరీదు రూ.4,500 లుగా 100యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు సబ్సిడీ పై ఆయా పథకాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా మత్స్య అధికారి కె. సుబ్బరావు మాట్లాడుతూ మిశ్రమ చేపల పెంపకం 10 యూనిట్స్ కి గాను జెనరల్-4 (40 శాతం సబ్సిడీ), మహిళలు కి -4 (60 శాతం సబ్సిడీ), ఎస్సీ లకు 2 యూనిట్స్ (60 శాతం సబ్సిడీ), బహిరంగ నీటి వనరులలో పెన్ కల్చర్ విధానంలో 60 శాతం సబ్సిడీగా ఒక యూనిట్ మంజూరు చేశామన్నారు. మంచు పెట్టెతో మోటార్ సైకిల్ యూనిట్స్ ను సంప్రదాయ వృత్తిలో ఉన్న వారికే ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్ష చేపల విక్రయ కేంద్రాలు యూనిట్ ఖరీదు రూ.20 లక్షలలో జెనరల్-5 (40 శాతం సబ్సిడీ), మహిళలు కి -2 (60 శాతం సబ్సిడీ), ఎస్సీ లకు 3 యూనిట్స్ (60 శాతం సబ్సిడీ), జీవనోపాధి కి యూనిట్ ఖరీదు రూ.4,500 లలో సంబందించిన 100 యూనిట్లు(మహిళలు) కోసం 60 శాతం సబ్సిడీ గా చేయూత నిచ్చి ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందగోరేఆసక్తి ఉన్న లబ్దిదారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు navasakam1.apcfss.in కు మీ మీ సచివాలయం నుంచి నేరుగా చేసుకునే అవకాశం ఉందని తెలియచేశారు. అందుకున్న దరఖాస్తును గ్రామ మత్స్య సహయకులు – మత్స్య అభివృద్ధి అధికారి / AIF – సహాయ సంచాలకులు (మత్స్య), ఉప సంచాలకులు- జాయింట్ డైరెక్టర్ (మత్స్య), ద్వారా స్క్రూటినీ అనంతరం జిల్లా స్థాయి కమిటీ కి సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రగతిశీల రైతు సిహెచ్. సుబ్బరాజు తో కలెక్టర్ ముఖాముఖి
జిల్లాలో ఆక్వా సాగు అభివృద్ధికి అనువైన ప్రాంతం, రకాల పై కలెక్టర్ మాధవి లత వివరాలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియోగం చేస్తూ ఆదాయ వనరుగా వృద్ధి చెందే అవకాశం ఉన్న వాటిపై ఎటువంటి అధ్యయనం చేశారు, మీరు ఉత్పత్తి చేస్తున్న వాటికి మార్కెటింగ్ సదుపాయం ఎక్కడనుంచి వస్తుంది వంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి కె. సుబ్బరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవ రావు, పిడి డి ఆర్ డి ఎ డేగలయ్య, ప్రోగ్రెసివ్ ఫార్మర్ సిహెచ్. సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *