Breaking News

మలేరియా మాసోత్సవాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మలేరియా మాసోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, నగరంలోని మలేరియా సిబ్బందికి మరియు NTR జిల్లా మలేరియా అధికారి వారి సిబ్బందికి కలిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. మలేరియా మాసోత్సావాలకు సంబంధించి ఈ నెలలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించటం జరిగింది. రాబోయే రోజులలో మలేరియాను, డెంగ్యూను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు గురించి కమిషనర్ సూచనలు ఇచ్చారు. అదేవిధంగా జులై 1 నుండి డెంగ్యూ మాసం రాబోవుతున్నది కావున డెంగ్యూ నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి కమిషనర్ అధికారులకు వివరిస్తూ, గతములో మలేరియా ప్రభావిత ప్రాంతాలలో మరలా మలేరియా రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వ్యాధి ఉదృతి గనుక గతములో కన్నా అధికము అయితే సంబందిత ఏరియ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి బి. రామారావు, విజయవాడ నగర అసిస్టెంట్ మలేరియా అధికారి సూర్య నాయక్, విజయవాడ నగర బయాలజిస్ట్/CMOH బాబు శ్రీనివాస్ మరియు మలేరియా సిబ్బంది పాల్గొనటం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *