Breaking News

తాళ్లపూడి జెడ్పీ హై స్కూల్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు

-రూ.176 లక్షలతో 15 అదనపు తరగతులు
-లబ్దిదారులు లే అవుట్ లలో ఇంటి నిర్మాణాలు చేపట్టాలి
-ఎప్పటికప్పుడు ఇంటి నిర్మాణ చెల్లింపులు జమ చేయడం జరుగుతోంది
-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నదేవరపేట గ్రామం లోని హౌసింగ్ లబ్దిదారులు ఇంటి నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు.

బుధవారం తాళ్లపూడి మండలం అన్నదేవర పేట లో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా . మాధవీలత మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తూ, ప్రభుత్వ స్కూల్స్ లో అదనపు తరగతి గదులు, నాణ్యమైన విద్య భోధన, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగా అన్నదేవరపేట లో జెడ్పీ హై స్కూల్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలిపారు. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన వారు వారి పిల్లలను 10 వ తరగతి తరువాత ఇంటర్, పై చదువులు చెప్పించేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సి బి ఎస్ ఈ తరహాలో హై స్కూల్ లోనే ఇంటర్ భోధన చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి తల్లితండ్రులు తప్పని సరిగా వారి పిల్లలను పదవ తరగతి తరువాత పై చదువులు చెప్పించాలని కోరారు. అన్నదేవరపేట స్కూల్ లో 2022-23 విద్యా సంత్సరం నుంచి ఇంటర్ భోధన చేపడుతున్నట్లు , ఈప్రాంతంలో ఉన్న వారు ఎటువంటి సంకోచానికి గురికాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అన్నదేవరపేట లో గ్రామానికి దగ్గరలోనే ఇంటి నిర్మాణాలు కోసం లే అవుట్ లో ఇంటి స్థలాలు ఉచితంగా పంపిణీ చేశామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఇక్కడ ఉన్న లబ్దిదారులు వెంటనే ఇళ్లను నిర్మించాలని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఇంటి నిర్మాణాలను ఒకేసారి చేపట్టడం ద్వారా త్వరితగతిన పూర్తి చేసుకోవడం సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ద్వారా లే అవుట్ వద్ద ఇసుక, సిమెంట్, స్టీల్, నీటి వనరులు అందుబాటులో ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని, సామూహికంగా ఒకేసారి ఇంటి నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వం ద్వారా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి దశల వారీగా నిధులను నేరుగా లబ్దిదారుల ఖాతాకు జమ అవుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *