అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డిజిటల్ వ్యవస్థ అందరికీ అందుబాటు, అనుసంధానం అనేది ప్రభుత్వం ‘అంత్యోదయ’ దార్శనికతలో అంతర్భాగం. 5 రాష్ట్రాల్లోని 44 ఆశావహ జిల్లాల్లోని ఇంకా అమలుకు నోచుకోని 7,287 గ్రామాలలో 4G మొబైల్ సేవలను అందించే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం గత సంవత్సరం ఆమోదించింది. 2021లో తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలనిప్రభుత్వ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అమలుకై నిర్దేశించిన గ్రామాల్లో 4G మొబైల్ సేవలను అమలుపరచాలన్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదించింది. దీని మొత్తం ఖర్చు రూ. 26,316 కోట్లు. ఈ ప్రాజెక్ట్ మారుమూల, దూర ప్రాంతాల్లోని 24,680ఎంపిక చేసిన గ్రామాలకు 4G మొబైల్ సేవలను విస్తరిస్తుంది. పునరావాసం, కొత్త-స్థావరాల ఏర్పాటు వంటి విశేష సందర్భాల్లో , ఇప్పటికే ఉన్న ఆపరేటర్ల సేవలను ఉపయోగించుకోవడం పై 20% అదనపు గ్రామాలను చేర్చడానికి ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నిబంధనల్లో వెసులుబాటును కలిగి ఉంది. ప్రస్తుతం 6,279 గ్రామాలలో 2G లేదా3G సేవలు మాత్రమేఅందుబాటులో ఉన్నాయి. ఈ పధకం ద్వారా ఆయా గ్రామాల్లో 4Gస్థాయి డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్కార్యక్రమాల్లో భాగంగా 4G సాంకేతికత తో BSNL ద్వారా అమలు అవుతుంది. దీనికి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుతున్నాయి. ఇందులో మూలధన వ్యయంతో పాటు నిర్వహణ వ్యయం కలిపి మెత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 26,316 కోట్లు. BSNL ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ కింద దేశవ్యాప్తంగా 4G టెక్నాలజీ సేవలను అమలు చేసే ప్రక్రియలో ఉంది, ఇది ఈ ప్రాజెక్ట్‌లో కూడా అమలు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సేవలను మరింత మెరుగ్గా అందించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ప్రాజెక్ట్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వివిధ ఇ-గవర్నెన్స్ సేవలు, బ్యాంకింగ్ సేవలు, టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్ మొదలైన వాటి డెలివరీని ప్రోత్సహిస్తుంది, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల్ని సృష్టిస్తుంది.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …