Breaking News

పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మాస్టర్ ప్లాన్, ఆర్.డి.పి. ప్రకారం పందుల కాలని దగ్గర పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పందుల కాలనీలో పైప్ లైన్ వెళ్లే ప్రాంతాన్ని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తీ కావచ్చాయని, హెడ్ వాటర్ వర్క్స్ నుండి గోరంట్ల కొండ మీదకు పైప్ లైన్ పందుల కాలనీ నుండి రావాల్సి ఉందని, సదరు ప్రాంతంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తీ చేయాలని ఆదేశించారు. గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ వలన షుమారు లక్ష మంది ప్రజలకు త్రాగునీరు అందించ వచ్చన్నారు. ప్రదానంగా ఇన్నర్ రింగ్ రోడ్, టిడ్కో గృహ సముదాయం, విలీన గ్రామాల ప్రజలకు సరిపడా త్రాగునీరు ఇవ్వడానికి వీలు కల్గుతుందన్నారు. పందుల కాలనీ దగ్గర పైప్ లైన్ వేసే ప్రాంతంలో భూమి కోల్పోతున్న వారికి చట్ట ప్రకారం టి.డి.ఆర్. బాండ్లు ఇవ్వడానికి, పైప్ లైన్ పనులు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ మూర్తి, ఏ.సి.పి.లు ఖాలేష, అజయ్ కుమార్, ఈ.ఈ. శాంతిరాజు, డి.ఈ.ఈ.లు హనీఫ్, కళ్యాణ రావు, టి.పి.యస్. స్రవంతి, ఏ.ఈ. వెంకటేశ్వరరావు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *