విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజకంగా పరిపాలన అందిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలో 6వ డివిజన్ లో చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్ ఆధ్వర్యంలో నేడు 33వ సచివాలయ పరిధిలోని రామాలయం రోడ్ నుండి మొదలై బి.ఎన్.ఆర్ నగర్,కరెంట్ ఆఫీస్ రోడ్,కార్ షెడ్ రోడ్,గులముద్దీన్ రోడ్,వీరన్న స్ట్రీట్ మరియు లైన్ క్లబ్ రోడ్ ప్రాంతాలలో అవినాష్ ఇంటిఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించి,ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఈ 6వ డివిజన్ లో ఇంటి ఇంటికి వెళ్తుంటే మహళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతుంటే జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బావుంది అని ప్రతి మహిళ అంటుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు వద్దకు ఇంటి ఇంటి కి వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు,డ్రైన్ నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ దే అని,ఇంకోసారి తెలుగుదేశం పార్టీ రాజకీయ మనుగడ కోసం ఇలాంటి షో రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ శ్రీ ఇజ్జాడ తేజేష్, జి.జి.ఎచ్ డైరక్టర్ ప్రభు దాస్,గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్,వైస్సార్సీపీ నాయకులు నర్సయ్య,శ్రీను,పడాల లక్ష్మణ్,సిమెంట్ ప్రసాద్,హుస్సేన్,నామాల కోటేశ్వర రావు,రామారావు,డాలి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News