Breaking News

సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా జగనన్న పాలన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి  దేశంలో మిగతా ముఖ్యమంత్రిలకు రోల్ మోడల్ గా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్ 87వ సచివాలయం పరిధిలోని చెన్నుపాటి పెట్రోల్ బంక్ రోడ్,మస్తాన్ స్ట్రీట్,విష్ణువర్ధన్ స్ట్రీట్,సిద్ధార్థ మహిళ కళాశాల రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ మూడేళ్ళలో ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 98 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత జగన్ గారిదే అని,మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు కొండంత భరోసా ఇస్తున్నారు అని తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను స్వయంగా చూసి రూపొందించిన మెనిఫెస్టో ని పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి గడప వద్దకే అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది అందజేస్తున్నారని అన్నారు.నేడు మా పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము జెండా మోసి కష్టపడిన సరే నాడు మాకు ఎలాంటి పధకాలు రాలేదు కానీ నేడు జగన్  ముఖ్యమంత్రి అయ్యాక మా ఇంట్లో ముసలివాళ్ళకి పెన్షన్,అమ్మఒడి,చేయూత లాంటి పధకాలు వస్తున్నాయి అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే మా ఈ పర్యటన లో అర్జీలు అందిస్తే సంబంధిత సచివాలయ సిబ్బంది తక్షణమే మంజూరు అయ్యేలా తగు చర్యలు తీసుకొంటారని భరోసా ఇచ్చారు. ఒకవైపు జనరంజక పరిపాలన అందిస్తూ జగన్  ప్రజల మనసులో కొలువై ఉంటే,మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రోజు పేపర్లో పడాలి, తమ అధినేత దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అని షో రాజకీయాలు, డ్రామాలు ఆడుతూ తన అనుకూల సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయ్యారని,గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటం లేదని ఎద్దేవా చేశారు.అందుకే వైస్సార్సీపీ నాయకులు వస్తుంటే ప్రజలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,సీనియర్ నాయకులు వలి,వైస్సార్సీపీ నాయకులు నహీద్,బుర్రి బాబురావు,షేక్ సుభాని,జగ్జీవన్ రావ్,చింతగుంట విజయ్,పోతురాజు,నూరి,ప్రసాద్,తిరుపతి,సలీం,పిల్లి వెంకట్, రాము,రత్నకుమారి,అనిత,రమ,భత్తులు నాగేశ్వరరావు,అబ్బాస్బి,నియమిన్, బాబు బాయ్ ,అస్గర్ ఏసుబాబు, ప్రతాప్, మౌలాలి ,రామ్,జావిద్ పటాన్ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *