తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త :
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం తిరుపతి జిల్లా సర్వ సభ్య సమావేశం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంనందు మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధికారుల కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికకు వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు ప్రసాద రావు ఎన్నికల అధికారి గా వ్యవహరించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు గా K.M.E..ప్రసాద్ (సహాయ వ్యవసాయ సంచాలకులు, భూసార పరీక్షా కేంద్రం తిరుపతి), ఉపాధ్యక్షులు గా తిరుపతి పట్టణ వ్యవసాయ అధికారి ప్రపూర్ణ, కార్యదర్శి గా చిల్లకూరు వ్యవసాయ అధికారి భవాని, సంయుక్త కార్యదర్శి గా చిన్నగొట్టిగళ్ళు వ్యవసాయ అధికారి ధనలక్ష్మి, కోశాధికారి గా వడమాలపేట వ్యవసాయ అధికారి విజయకుమార్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు వ్యవసాయ అధికారులు, పాల్గొన్నారు
Prajavartha Online Telugu News