పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస నియోజకవర్గం పలాస మండలం కేదారిపురం గ్రామంలో మొన్న వరదలలో గల్లంతైనటువంటి బోడసింగి కూర్మారావ్, పాడి శంకర్ కుటుంబాలను గురువారం రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. గల్లంతైన వ్యక్తులలో పాడి శంకర్ మృతదేహం లభ్యమవగా, బోడసింగి కూర్మారావు మృతదేహం ఇంకా లభ్యం కాలేదు ప్రత్యేక బృందాలు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంత్రి మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుందని ప్రభుత్వపరంగా ఆయా కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పలాస ఎంపీపీ ప్రతినిధి, పలాస మండల వైసీపీ అధ్యక్షులు, పలాస మున్సిపల్ చైర్మన్, నాయకులు, అధికారులు ఉన్నారు.
Tags palasa
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …