-రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత
-గురువారం తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తానేటి వనిత
-గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరుపై మంత్రి ఆరా
తాళ్ల పూడి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం అందిస్తున్న పథ కాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వై.యస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో సంక్షేమ పథకాలు ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రభుత్వ పథకాలు తెలియజేయడానికి నేరుగా గడప గడపకు వస్తున్నామని వివరించారు. అమ్మఒడి, ఋణ మాఫీ పథకం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి బృహత్తర పధకాలు పేద ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తానేటి వనిత తెలిపారు. పేదవాడి ఇంటి కల నెరవేర్చే దిశగా, రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, వారి ఐచ్చికత మేరకు ఇళ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హత ఉండి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి స్థలం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ, వార్డు, వాలంటీర్లు, ప్రజ లకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అంద జేయాలని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. గ్రామ వార్డుసచివాలయం లో పనిచేసే కార్యదర్శుల పోస్టులను క్రమబద్ధీకరించడం జరిగిందని, వారికి భరోసా ఇచ్చే క్రమంలో జగనన్న పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టిన ట్లు తెలిపారు. అర్హులకు ఆయా పథకాలు చేరాలనే జగనన్న లక్ష్యం కోసం పని చెయ్యలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లభ శెట్టి గంగా భ వాని, చిన్ని, జిల్లా వైస్ చైర్మన్ శ్రీలేఖ, ఏ.యం.సి. ఛైర్మన్. వల్లభ శెట్టి శ్రీనివాస్, ఎం.పి.పి. జొన్నకూటి పోసిరాజు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్ర జలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News