Breaking News

ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుంది…

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పలాస నియోజకవర్గం పలాస మండలం కేదారిపురం గ్రామంలో మొన్న వరదలలో గల్లంతైనటువంటి బోడసింగి కూర్మారావ్, పాడి శంకర్  కుటుంబాలను గురువారం  రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. గల్లంతైన వ్యక్తులలో పాడి శంకర్ మృతదేహం లభ్యమవగా, బోడసింగి కూర్మారావు మృతదేహం ఇంకా లభ్యం కాలేదు ప్రత్యేక బృందాలు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంత్రి మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత విచారకరమని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విదాల అండగా ఉంటుందని ప్రభుత్వపరంగా ఆయా కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పలాస ఎంపీపీ ప్రతినిధి, పలాస మండల వైసీపీ అధ్యక్షులు, పలాస మున్సిపల్ చైర్మన్, నాయకులు, అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *