రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల జారీలో కలెక్టర్లు నిశితంగా పరిశీలించిన పంపిణీ చేసే విధానం పై వివరాలు సమర్పించాలని భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రీసర్వే , జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల మంజూరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ సి హెచ్ శ్రీధర్ తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే దాదాపు పూర్తవుతుందని, సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమగ్ర సర్వే పూర్తయిన 2వేల గ్రామాలకు నవంబర్ 1 లేదా 2వ తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూహక్కు పత్రాలను పంపిణీచేసే అవకాశముందని స్పష్టం చేశారు. కావున ఈ నెల 15 నాటికి కలెక్టర్లు భూహక్కు- భూరక్ష పత్రాలు మంజూరుచేయబోయే పట్టదారుల వివరాలను నిశితంగా పరిశీలించి తమకు నివేదిక పంపాలని కోరారు. సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన ముసాయిదాను తొలుత ప్రచురించాలని, ప్రచురించిన ముసాయిదాపై కలెక్టర్లు నాలుగైదు రోజుల్లో నిశితంగా పరిశీలించి, మార్పులు, చేర్పుల తదుపరి తుది జాబితాను తమకు పంపాలని అన్నారు. ఆ జాబితా ఆధారంగా జగనన్న భూహక్కు-భూరక్ష పత్రాలు సిద్ధం అవుతాయని తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెల 22లోగా పూర్తికావాలని ఆయన వివరించారు. భూహక్కు పత్రాలలో ప్రచురణే కొలమానం అయినందున క్షుణ్ణంగా పరిశీలించిన పిదప మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ప్రస్తుతం మంజూరుచేయబోయే గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలన్నీ రానున్న మూడు నెలల్లో సర్వే పూర్తిచేసి భూహక్కు పత్రాల పంపిణీకి సిద్ధం చేయాలని ఆదేశించారు. హక్కు పత్రాలు పంపిణీ కాకుండా చేశామని చెప్తే వారిని సర్వీసు నుండి తొలగిస్తామని హెచ్చరించారు. గడువులోగా మ్యుటేషన్లు, వివాద స్థలాలపై చర్యలు తీసుకోవాలని, అలాగే కోర్టు పరిధిలో ఉండే భూసమస్యలపై ప్రతి రోజు కోర్టు జారీచేసే ఉత్తర్వులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు. ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాధవీలత వివరిస్తూ జిల్లాలో ఇప్పటి వరకు మ్యుటేషన్ సవరణ వెరిఫికేషన్ కొరకు 1102 దరఖాస్తుల రాగా ఇందులో 1096 దరఖాస్తులను పరిశీలించామని, ఇంకా ఆరు పరిశీలించాల్సి ఉందన్నారు. భూ హక్కు, భూ రక్షా కింద రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ద్రువపత్రాలను సమగ్రంగా తనిఖీ చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలు జిల్లా కు సుమారు 4 వేల పత్రాలు అందయన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆయా భూ హక్కు పత్రాలను సరిచూసుకుని, యజమానుల వివరాలు గ్రామ సర్వేనెంబర్ తదితర అంశాన్ని ధృవీకరణ చేసేందుకు చర్యలు చేపట్టమన్నారు. జిల్లాలో డాటెడ్ భూములకు సంబంధించిన 26 దరకస్తులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 4,24,000 వేల సర్వే నంబర్ లకి గాను ఇప్పటి వరకు 4 లక్షల మేర భూముల డేటా ఎంట్రీ పూర్తి చేశామన్నారు. జిల్లాలో 1,58,000 గృహ లబ్దిదారుల లో 1,50,800 మంది ఈ కే వై సీ పూర్తి చేసిన ట్లు కలెక్టర్ తెలిపారు. 90 రోజుల ఇంటి పట్టాల కార్యక్రమం లో భాగంగా 13900 ధరకాస్తు లు రాగా 9350 అర్హు లుగా గుర్తించామని, ఇందులో 2650 మందికి స్థలాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో వివిధ శాఖల కు సంబంధించిన కోర్టు కేసుల పై తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.హెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, సర్వే శాఖ సహాయ సంచాలకులు పి. లక్ష్మణరావు, ఏ వో జి.బీమా రావు, సూపరింటెండంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News