తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక ఓటర్ల సవరణ -2022 జరుగుతున్న నేపధ్యంలో 167- తిరుపతి నియోజకవ ర్గం లో సంబంధించి 7 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు, 14 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు నిర్దేశించడం జరిగిందని తిరుపతి ఈ ఆర్ ఓ మరియు నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. గురువారం రాత్రి స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ ఆర్ ఓ సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022 సంబంధించి పలు విషయాలు వివరించారు. తిరుపతి నియోజకవర్గ ఎలక్టరోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022 లో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 7 పోలింగ్ స్టేషన్లను భవనాల మరమ్మత్తులు, వినియోగంలో లేనందున దగ్గరగా అందుబాటులో ఉన్న మరో 7 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అందులో 173, 174, 175, 231, 232, 233, 244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. గతంలో ఉన్న భవనాల పేర్లు మార్చడం వల్ల తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 14 పోలింగ్ కేంద్రాలను ఉన్న చోటే ఉంచుతూ పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేయడం జరిగిందని వివరించారు. గతంలో వున్న 265 వున్నాయని, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కలపడం వంటివి చేపట్ట లేదనివివరించారు.
ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎం.ఎల్.సి ల గడువు రానున్న మార్చి మాసం లో ముగియనున్న సందర్భంగా ఓటర్ల నమోదు కు షెడ్యుల్ జారీ అయిందని ఈ నెల ఒకటి నుండి నవంబర్ 07 వరకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 30 న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారని వివరించారు. ceoandhra.nic.in వెబ్ సైట్ నందు కూడా ఆన్ లైన్ నమోదు ఉన్నదని ఫారం – 18, ఫారం – 19 లను ఎం.ఎల్.సి స్థానాలకు ఉపయోగించాల్సి ఉంటుందని సూచించారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022 మేరకు ప్రస్తుతం 265 పోలింగ్ కేంద్రాల పరిధి లో నేడు 272171 ఓటర్లు వున్నారని జాబితాను పార్టీల ప్రతినిధులకు అందించి, అభ్యంతరాలు ఉంటే వ్రాత పూర్వకంగా ఇవ్వాలని పరిశీలించి ఆదర్శవంతమైన ఓటర్ల జాబితా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రానున్న జనవరి 2022 న ప్రకటించను న్నామని వివరించారు. ఎన్నికల ప్రక్రయలో వాలింటర్ల పాత్ర వుండదని తెలిపారు.
స్థానికంగా లేని ఓటర్ల గుర్తింపు చేపట్టి తొలగించాలని , టీచర్ల , గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో ఫేక్ ధృవ పత్రాలు లేకుండా చూడాలని , ఎస్ సి కాలని, ఎస్టీ కాలని అని పేర్లు మాత్రమే వుండాలని కోరారు.
ఈ సమావేశంలో బహుజన సమాజ పార్టీ వెంకటేష్, మహేష్, భారతీయ జనతా పార్టీ వరప్రసాద్, సామంచి శ్రీనివాస్, సి.పి.ఐ. విశ్వనాథ్, సి.పి.ఐ – ఎం సుబ్రమణ్యం, లక్ష్మి, తెలుగుదేశం నారాయణ , వై.ఎస్.ఆర్.సి.పి వెంకటేష్, జన సేన పార్టీ ప్రతినిధులు,
ఏ ఈ ఆర్ ఓ మరియు అర్బన్ తహశీల్దారు వెంకటరమణ, ఎలక్ష న్ డి టి పవన్ డి సి చంద్రమౌళి పాల్గొన్నారు.