Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించి వ్యక్తిగత సహాయంగా 25 వేల రూపాయలను అందించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు

-బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది….
-బాధ్యత కుటుంబాలను పరామర్శించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని అజిత్ సింగ్ నగర్ చెందిన సిహెచ్ సాయి మధు, నల్లపు రాఘవ. శాంతినగర్ పైపుల రోడ్డు కు చెందిన ఎస్ వెంకట ఫణి కుమార్, సిహెచ్ సాయి, ప్రణదీప్ జయ ప్రభుదాస్, ఆర్ అభిలాష కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి వ్యక్తిగత సహాయంగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అందజేశారు. ఈ నెల 4వతేదీన బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నగరానికి చెందిన ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలను గురువారం కలెక్టర్ ఢిల్లీ రావు పరామర్శించి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని అన్నారు. జరిగిన సంఘటనపై ప్రభుత్వానికి నివేదిక అందించామని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందెవరకు తక్షణసాయంగా 25వేల రూపాయలు వ్యక్తిగత సహాయాన్ని కలెక్టర్ ఢిల్లీ రావు బాధ్యత కుటుంబాలకు అందజేశారు. పరామర్శించిన వారిలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజ రెడ్డి, తాహాసిల్దార్ దుర్గాప్రసాద్, స్థానిక కార్పొరేటర్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *