తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం భద్రతకు మరింత భరోసాగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15 నుండి కుటుంబ డాక్టర్ విధానం అమలు చేస్తున్నారని అందుకోసం వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరించి పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి అన్నారు. శనివారం సాయంత్రం కుటుంబ డాక్టర్ విధానం జిల్లాలో అమలుపై డిప్యూటీ సీఎం, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఏపీ ఎమ్ ఐ డి సి చైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రజాప్రతినిధులతో, వైద్య అధికారులతో సమావేశమై చర్చించి ఈ పథకం అమలు జిల్లాలో పగడ్బందీగా అమలు చేసే విధంగా నిర్ణయించారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్య వైద్యం వ్యవసాయం లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి వైద్యులు సందర్శించే లా ఒక గొప్ప కార్యక్రమం కుటుంబ డాక్టర్ విధానం తీసుకువచ్చారని అన్నారు. వైద్యులను దేవుళ్ళు గా భావించే ప్రజలు అందుకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలని సూచించారు. జిల్లాలో 435 వైయస్సార్ విలేజ్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఇప్పటికే 385 కేంద్రాలు నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామాన్ని నెలకు రెండు సార్లు తప్పనిసరి వైద్యులు సందర్శించాలని ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఎలా ఉండాలని అన్నారు. ప్రజాప్రతినిధులుగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంతోమంది జబ్బుల బారిన పడి వైద్యం చేసుకోలేక ఉన్న విషయాన్ని గమనించామని అన్నారు. అలాంటివారికి మీరు అండగా నిలిచి సూచనలు చేయాలని ఉచిత మందులు ఇవ్వాలని సూచించారు. నాడు నేడు కార్యక్రమం తో ప్రభుత్వం వైద్యశాలలకు మహర్దశ వచ్చిందని, కనీసం మూడు నెలలకు సరిపోయే మందులు అందుబాటులో ఉన్నాయని సంతోషమని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీసుకున్న ప్రతి నిర్ణయం అందరికీ తెలిసేలా ప్రచారం కల్పించి పేద ప్రజలకు ఉపయోగపడేలా ప్రజా ప్రతినిధులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉంటుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ లైన్స్ క్లబ్ ప్రతినిధులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 100 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు విక్రం తెలిపారని , కనీసం 50 సెంట్ల స్థలం అందించగలిగితే ఉచితంగా రోజుకు 36 మందికి పేషెంట్లకు వైద్యం అందిస్తారని అన్నారు.
తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశంలోనే మన రాష్ట్రం అమలు చేస్తున్నదని అందుకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందుకునే పేద ప్రజల వైద్య రికార్డులను రూపొందించి అందుబాటులో ఉంచగలిగితే జబ్బులను ముందుగానే గుర్తించి వైద్యం ద్వారా వారికి ఆరోగ్యం ప్రసాదించవచ్చు అని సూచించారు.
ఈ సమావేశంలో శాసనసభ్యులు వరప్రసాద్, కోనేటి ఆదిమూలం , డి ఎం హెచ్ ఓ శ్రీహరి, 104 వాహన ప్రత్యేక అధికారి హనుమంతరావు, డి పి ఎం శ్రీనివాస రావు, డి ఈ ఓ శాంతకుమారి, డిప్యూటీ డిఎం హెచ్ ఓ సుధారాణి , ఎన్ సి డి ప్రోగ్రామ్ ఆఫీసర్ హర్షవర్ధన్, డాక్టర్లు పాల్గొన్నారు.