విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీనగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫౌండర్ చైర్మన్ అప్పికట్ల జీవరత్నం చీఫ్ గెస్ట్ గా పాల్గొని ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీన ఢిల్లీలో జరిగే పదవ వార్షికోత్సవమును, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కమిటీ సభ్యులు పాల్గొనిజయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ ప్రెసిడెంట్ డా. జాన్ కోలవెంటి మాట్లాడుతూఇంకా క్రైస్తవ హక్కులను పరిరక్షించుకోవాలని, దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని వివరిస్తూ క్రైస్తవులందరూ ఐక్యత కలిగి ఉండాలని మనకున్న హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. 36 రాష్ట్రాల కమిటీ సభ్యులు ఢిల్లీలో జరిగే పదవ వార్షికోత్సవానికి తప్పక పాల్గొనవలసిందిగా కోరారు. నేషనల్ జనరల్ సెక్రెటరీ డా ఎస్ .త్యాగరాజు ఇలియాస్ డేవిడ్ రాజు అధ్యక్షతవహించారు . ఢిల్లీలో జరిగే పదవ వార్షికోత్సవ వేడుకకు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఇంకా సభ్యులుగా చేరేవారు, తమ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్ డా. సుధారాణి ,నేషనల్ ఉమెన్ సెక్రెటరీ ఉషారాణి, నేషనల్ జాయింట్ సెక్రెటరీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News