Breaking News

రెండో విడత నవోదయం కార్యక్రమం…

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో శుక్రవారం నాడు ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతి కోసం , విద్య, ఉపాధి, వ్యాపారం మరియు ఇతర సమస్యల పరిష్కారానికై రెండో విడత నవోదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తోటి మరియు జిల్లా రెవెన్యూ అధికారి పాల్గొని అర్జీలను స్వీకరించారు. డివిజన్ల వారీగా మరియు జాబ్ మేళా ద్వారా అర్జీలను స్వీకరించారు. రెండవ విడత నవోదయం కార్యక్రమంలో 615 వరకు దరఖాస్తులు స్వీకరించారు. విద్య, ఉపాధి కై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా భూ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత తాహసిల్దార్ లకు అందించి పరిష్కరించే వలసిందిగా ఆదేశించారు. తొలి విడత ఏర్పాటుచేసిన నవోదయం కార్యక్రమం మరియు రెండవ విడత నవోదయం కార్యక్రమాల్లో ని దరఖాస్తులను విడి విడిగా విశదీకరించ చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. గత నవోదయ కార్యక్రమంలో స్ఫూర్తిని పొంది న శావల్యాపురం పొట్లూరు వాసి దేవ కుమారి బట్టల వ్యాపారానికి సంబంధించి మంజూరు అతన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఉద్యోగాలకై వచ్చి 49 దరఖాస్తులను రాస్విన్ గ్లోబల్ సర్వీసెస్ మరియు, లియో గ్లోబల్ సర్వీసెస్ సంస్థల వారు దరఖాస్తులను పరిశీలించి నెలకు 13 వేల నుంచి 15 వేల వరకు వేతనం పొందే విధంగా విజయ జ్యోతి, కోటేశ్వరరావు, శివ తదితరులకు తక్షణమే నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ శివ శంకర్ లో తోటివారి ద్వారా అందజేశారు. ఉన్నత చదువు కై శ్రీ ఏ శ్యామ్ ఎంటెక్ చదువుకునే విధంగా బ్యాంకు లోన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ను ఆదేశించారు. అదేవిధంగా అరుణ్ తేజ ఐఐటి మెటలర్జీ మద్రాసులో చదువుకునేందుకు అవసరమైన ల్యాప్టాప్లు సాంకేతిక పరికరాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంధ విద్యార్థుల హాస్టల్ కు సంబంధించి నెలవారీ రెంటు చెల్లించే విధంగా చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా ముద్రితమైన దళిత సాధికారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. మూడు డివిజన్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను గత నవోదయం మరియు ఇప్పుడు వచ్చిన వాటిపై తీసుకునే చర్యలను తెలియజేయవలసిందిగా సంబంధిత డి ఎల్ డి ఓ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పదిహేను రోజుల తర్వాత డివిజన్ వారీగా నవోదయం కార్యక్రమంపై డి ఎల్ డి వోలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఓబుల నాయుడు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డిఎ పిడి బాలునాయక్, ఎల్ డి ఎం వెంకటేశ్వర్లు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి బాజీ బాబు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ మహాలక్ష్మి, నవోదయం నోడల్ అధికారి సంజీవ రావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *