స్టోరీ
– ప్రజలు వినతులు అందించడానికి సచివలయాల్లో ప్రతి రోజు “స్పందన”
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పనులు ఆలస్యమవుతాయని బాధ , పేదవాడికి సంక్షేమం అందదనే బెంగ లేకుండా గ్రామ /వార్డు సచివాలయాల ఏర్పాటుతో గాంధీ కళలు కన్న గ్రామస్వరాజ్యం సాకారం దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రజల సేవల్లో ప్రగతి భవనాలుగా కనిపిస్తూ అర్హతగల ప్రజలకు స్థానికంగానే ప్రభుత్వ పథకాల లబ్ది కలిగించి, పౌర సేవలు రెవెన్యూ , మునిసిపల్ , విద్యుత్ ఇప్పటి వరకు అందిస్తున్న సేవలకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ సేవలు ఆధార్ , పాస్ పోర్ట్ , ఈ-శ్ర మ్ , రవాణా సేవలు వంటివి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది.
సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల పధకాల అమ్మఒడి , వసతి దీవెన , విద్యాదీవెన, అవ్వాతాతల , విభిన్నప్రతిభావంతుల పించన్లు , వైఎస్ ఆర్ ఆసరా , వైఎస్ ఆర్ చేయూత , పేదలందరికి ఇళ్ళు, రైతు బరోసా, సున్నావడ్డీ , ఇన్సురెన్స్ వంటివి అర్హతగల వారికి నమోదు చేస్తూ ఇప్పటికే అందుతున్న ఉచిత సేవలతో పాటు సచివలయాల్లో మరో విప్లవాత్మకంగా స్థానికంగానే ప్రజలు కామన్ సర్వీసులు (CSC) సేవలు పొందుతున్నారు.
ఒకప్పుడు పల్లెల్లో అందుబాటులోని లేని సేవలు ఆధార్ నమోదు , పాన్ కార్డ్ , ఈ- శ్రమ్ , పి ఎం కిసాన్ ఇకేవైసి , ఎల్ ఐ సి, విద్యుత్, ఇంటిపన్ను, ఇన్కం టాక్స్ చెల్లింపులు, బస్ , ట్రైన్ , ఐ ఆర్ సి టి ట్రావల్ టికెట్లు, పాస్ టాగ్ రీచార్జ్ , టెలి మెడిసిన్ సేవలు, టాటా 1 ఎం.జి సేవలు ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి, సచివాలయ వ్యవస్థ ప్రజలకు సేవలు పరిపూర్ణంగా అందిస్తున్నది.
జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి : ప్రజలకు అన్నిరకాల ప్రభుత్వ , పౌర సేవలు దగ్గరలోనే అందుబాటులోకి వచ్చాయి. వీటితో పటు పనిదినాల్లో సాయత్రం 3 నుండి 5 గంటల వరకు విధిగా స్పందన వినతులు స్వీకరణ చేపట్టాలనే లక్ష్యం మేరకు చేస్తున్నారు. ప్రధానంగా ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఆదార్ అన్నది కనీసం 10 సంవత్సరాల కొక్కసారి తప్పని అప్ డేట్ అవసరం, గతంలో ఆధార్ సవరణలకు ఇబ్బంది పడేవాళ్ళు , అసంఘటిత రంగాల కార్మికులకు ఈ శ్రమ్ అందించడం ఎన్నో సమస్యలకు సచివాలయం ఒక పరిష్కారంగా వుంది.
డివిజనల్ లెవల్ డెవెలప్ మెంట్ అధికారిణి ( గ్రామ సచివాలయాల అధికారి) సుశీలా దేవి: జిల్లాలో 691 గ్రామ / వార్డు సచివాలయాలు 657 రకాల పౌర సేవలు అందుబాటులో వున్నాయి. ప్రతి సచివాలయంలో సేవల వివరాలు తెలిపే పోస్టర్లు ఏర్పాటు చేసాం. వాలంటీర్లు విధిగా ప్రభుత్వ పథకాలు గడప గడపకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వుండే విధంగా 87 ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయి ప్రజల నుండి మంచి స్పందనతో పాటు పౌర సేవలపై అభినందిస్తున్నారు, మరో 25 కేంద్రాలు త్వరలో ప్రారంభిస్తున్నాం.
అవిలాల గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ రూపెంద్రా రెడ్డి : రేషన్ కార్డు , పించన్లు మినహా రాష్ట్రంలో ఏ సచివాలయం నుండి అయినా అన్నిరకాల పౌర సేవలు పొందే విధంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రేషన్ కార్డు , పించన్లు స్థానికంగా పరిశీలించాలి కాబట్టి సంబందిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. బయట మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు పరిస్థితి తెలియడం కొంచం కష్టం , సచివాలయంలో చేసుకున్న దరఖాస్తులకు ఎ ఆధికారి వద్ద వుంది ? ఏ స్థాయిలో ఉందనేది దరఖాస్తు దారుని మొబైల్ కు ఎప్పటి కప్పుడు స్టేజ్ వైజ్ మెసేజ్ వెళుతుంది. ఇప్పుడు అన్నిరకాల సేవలకు ప్రజలు సచివలయాలకు వస్తున్నారు, రైల్వే టికెట్స్ అయితే కోటా వుంటుందని, ఇక్కడ సులభంగా వుందని ప్రజలు వస్తున్నారు.
లబ్దిదారుడు : నవీన్ రేషన్ కార్డు మార్పుకోసం సచివాలయం కు వచ్చాను. నాకు పెళ్లి అయి ఒక సంవత్సరం అయ్యింది నాభార్య పేరు మా కుటుంబం రేషన్ కార్డులోకి రావాలని వచ్హాను , వెరిఫికేషన్ పూర్తి అయింది, త్వరలో వస్తుందని తెలిపారు. మా గ్రామాల్లో అందుబాటులో సచివాలయం వుండటం సంతోషం, గతంలో దేనికైనా టౌన్ కు వెళ్ళాల్సి వచ్చేది. పేదలు పట్టణాలకు వెళ్లి ప్రభుత్వ, పౌర సేవలు పొందడం ఖర్చుతో కూడుకున్న పని , ఆబాధ ఇప్పుడు లేదు .