తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఈ నెల 9 నుండి 11 వరకు జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలలో మూడు రోజులపాటు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహించనున్నట్లు డిఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో ఏపీపీఎస్ అధికారులతో , పరీక్షల నిర్వహణ లై జన్ అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సమావేసమై పలు సూచనలు చేశారు. డిఆర్ఓ మాట్లాడుతూ మూడు రోజులు పాటు నిర్వహించనున్న పరీక్షలకు 890 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు , అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల అనుమతి లేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాలు:(3) కే ఎం ఎం కళాశాల రామిరెడ్డిపల్లి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, పుత్తూరు, శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కళాశాల , పుత్తూరు ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు మల్లికార్జున , హరిబాబు ఆర్టీసీ , విద్యుత్ శాఖల అధికారులు లైజన్ విధులు కేటాయించిన తహసిల్దార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News