రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మేలు జాతి పేయ్య దూడల పశువుల ఉత్పత్తి కోసం జిల్లాకు కేటాయించిన 1600 డోసులను పూర్తి నిబద్దత తో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో వివిధ మండలాలకు కేటాయించిన వీర్యకణాల యూనిట్స్ పశు సంవర్ధక శాఖ అధికారులకు జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ టి జి. సత్య గోవింద్ ద్వారా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేసి, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మేలైన పశుసంపద కోసం లింగ నిర్ధారిత వీర్యసేకరణ ద్వారా పేయ్య దూడల సంపద పెంచు కునే విధానంలోఉత్తమ మైన పాల దిగుబడి లక్ష్యంగా అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు కేటాయించిన 1600 యూనిట్స్ 18 మండలాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. పశు పోషణ చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సబ్సిడీ పై అందచేస్తున్న పేయ్య దూడల ఉత్పత్తి చేసే నిర్ధారిత వీర్యాన్ని సంబంధించిన పశువైద్య అధికారులను, సిబ్బందిని సంప్రదించ వచ్చు నని పేర్కొన్నారు.
జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ టి జి. సత్య గోవింద్ వివరాలు తెలుపుతూ, పేయ్య దూడ నిర్ధారిత వీర్యం నాళికలు రెండు పర్యాయాలు వెయ్యడం కోసం రైతులకు సబ్సిడీ గా అందచెస్తునట్లు తెలిపారు. ఒకొక్క యూనిట్ రూ 675 చొప్పున రెండింటికీ రూ.1350 చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై రూ.500 లి సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్న దృష్ట్యా రైతులు వారి రూ 850 లు చెల్లించి రెండు దోసుల పేయ్య దూడ నిర్ధారిత వీర్య నాళీకలు పొందడం ద్వారా పేయ్య దూడల ఉత్పత్తి పెంచే దిశలో కలిసి ముందుకు రావాలని కోరారు. ప్రతి మండలానికి 75 యూనిట్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News