Breaking News

మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఖరీఫ్ 2022-23 ఖరీఫ్ సీజన్లో పూర్తి స్థాయి లో మద్దతు ధర కు ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారని అందుకు అనుగుణంగా జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాలశాఖ వి సి అండ్ ఎం డి జీ. వీరపాండ్యన్ స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, బ్యాంకు గ్యారంటీ, రవాణా, రైతులకు ఖరీఫ్ సీజన్లో కొనుగోలు పై అవగాహన కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ అన్నారు . మంగళ వారం స్థానిక కలెక్టరేట్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, జిల్లా  కలెక్టర్ మాధవీలత, జేసీ శ్రీధర్ లు పాల్గొనగా, రాష్ట్ర స్థాయిలో ఖరీఫ్ 2022-23 ధాన్యం సేకరణ పై విడియో కాన్ఫరెన్స్ ను  అమరావతి నుంచి జిల్లా కలెక్టర్ లతో పౌర సరఫరాల శాఖ విసి అండ్ ఎండి జీ.వీర పాండ్యన్ నిర్వహించారు . రైతులు స్వంతం గా వాహనాలు సమకూర్చుకుంటే వారికి ధాన్యం సరుకు రవాణా విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తూ, ధాన్యం సేకరణ కి సంబంధించి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆచరణలో పెట్టడానికి చొరవ చూపాలని అన్నారు. ముఖ్యంగా కోర్ సమస్య ల విషయం లో మరింతగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు సరిపడే గన్ని బ్యాగులు ప్రతి అర్భికే కు వొచ్చే ధాన్యం కు అనుసంధానంగా సిద్దం చేసుకోవాలన్నారు. కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్ , బ్యాంకు గ్యారంటీ, లేబర్ (హమాలీస్), రవాణా, వే బ్రిడ్జెస్, పరికరములు, సిబ్బంది, రైతులకు ధాన్యం కొనుగోలు కి సంబంధించి ప్రక్రియ పై అవగాహన కల్పించడం కూడా బాధ్యత గా చేపట్టాలని అన్నారు. హమాలీ ఛార్జీలు, సరుకు రవాణా చార్జీలు ధరలను హేతుబద్ధం గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని , ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవని అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోలు విషయం లో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా చెల్లింపులు విషయం లో కూడా మిల్లర్లు తో ఉన్నత స్థాయి అధికారులు చర్చించి సానుకూల దృక్పథం రావడం జరిగిందనీ తెలిపారు. కొనుగోలు జరిగిన 21 రోజుల్లో చెల్లింపులు జరిపే విషయంలో ప్రభుత్వం సానుకూలతవ్యక్తం చెయ్యడం జరిగిందన్నారు.

ప్రతీ రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా ఉన్న కొనుగోలు కేంద్రానికి వచ్చే ప్యాడి కు సరిపడే మూడో శాతం గన్నీ బ్యాగులు సిద్దం చేసుకోవాలని, వాటిని రొటేషన్ పద్దతిలో వినియోగించు కోవచ్చునని అరుణ్ కుమార్ అన్నారు. సాంకేతిక పరమైన అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని వాటి సమస్య పరిష్కారం చెయ్యడం జరుగుతుందని అన్నారు. అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో కోత పూర్తి అయ్యిందని, క్షేత్ర స్థాయి రైతులు వెలిబుచ్చిన అభిప్రాయాలు పరిగణన లోకి తీసుకున్నట్లు, సాంకేతిక పరమైన అంశాలు పరిష్కారం కోసం వారికి హామీ ఇచ్చామని అన్నారు.

ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో చేపడుతున్న కార్యాచరణ ప్రణాళిక పై కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ లు వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, డి ఎస్ వో పి. ప్రసాద రావు, డి ఎం (సి ఎస్) ఆర్. తనూజా, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, సహాయ మేనేజర్ త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *