Breaking News

కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, ప్రజల నుండి అందే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు తొలుత సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కార్యదర్శుల మధ్య సమన్వయం పెరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికీ మెరుగైన ప్రభుత్వ సేవలు చేరువ కావాలనే ఉదేశ్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందదని, అందుకు తగిన విధంగా విధులు నిర్వహించాలన్నారు. సచివాలయాల్లో కరెంట్ బిల్లులు, ఈ.సి. దరఖాస్తులు, జనన,మరణ ధ్రవీకరణ పత్రాలు, ఇతర ప్రభుత్వ సేవల పై వాలంటీర్లు ప్రతి ఇంటిలో తెలియ చేయాలన్నారు. ప్రతి సోమవారం అడ్మిన్ కార్యదర్శులు వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు సచివాలయం ద్వారా అందే సేవల పై అవగాహన కల్గించడం పై సమీక్ష చేయాలన్నారు. బి.ఎల్.ఓ.లు గత శని, ఆదివారాల్లో చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ డే స్ ల్లో అందిన ఫారం 6,7,8 లను వెంటనే గరుడ యాప్ లో అప్ లోడ్ చేయాలని, బి.ఎల్.ఓ.లు తమ పరిధిలోని ప్రతి ఇంటి సర్వే నూరు శాతం పూర్తీ చేయాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలని, స్పందనకు అందే ప్రతి అర్జీ తప్పనిసరిగా ముందు, తర్వాత ఫోటో, విచారణ రిపోర్ట్ అప్ లోడ్ చేసిన తర్వాతనే క్లోజ్ చేయాలని, లేకుంటే తగు చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. సచివాలయాల్లో త్రాగునీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
అనంతరం కమిషనర్ గారు గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 47 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 22, ఇంజినీరింగ్ విభాగం 15, ప్రజారోగ్య విభాగం 3, రెవెన్యూ విభాగం 6, ఎలక్షన్ సెల్ 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్.ఈ. భాస్కర్, సిటి ప్లానర్ మూర్తి, సిఎంఓహెచ్ డాక్టర్ విజయ లక్ష్మి, మేనేజర్ శివన్నారాయణ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్ లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *