గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో విభాగాల వారీగా కోర్ట్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి సోమవారం కేసుల పై సమీక్ష చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో విభాగాల సూపరిండెంట్ లతో కోర్ట్ కేసుల పరిష్కారం, కౌంటర్స్, అఫిడవిట్స్, మధ్యంతర ఉత్తర్వుల పై ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ వివిధ విభాగ సూపరిండెంట్లు తప్పనిసరిగా వారి విభాగ కేసుల పై సమగ్ర అవగాహన కల్గి ఉండాలన్నారు. ప్రతి కేసును సర్టిఫై చేసి లీగల్ సెల్ కు అందించాలని, కేసుల్లో కౌంటర్స్, ప్యారావైజ్ రిమార్క్స్, అఫిడవిట్స్ ని లీగల్ సెల్ తో సమన్వయం చేసుకోవలని ఆదేశించారు. పట్టణ ప్రణాళిక విభాగంలో అధికంగా పెండింగ్ కేసులు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ కేసుల్లో కోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వారం రోజుల్లో అందించాలని లీగల్ సెల్ ని ఆదేశించారు. కోర్ట్ తీర్పు ఇచ్చిన వాటిలో క్షేత్ర స్థాయిలో జరిగిన అమలు పై కూడా నివేదిక ఇవ్వాలని, కేసుల్లో ప్రత్యేకంగా అదనపు కమిషనర్ దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ పి.రోజ, మేనేజర్ శివన్నారాయణ, వివిధ విభాగ సూపరిండెంట్లు పాల్గొనారు.
Prajavartha Online Telugu News