-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చందన చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పందనకు వచ్చే పేదవారికి ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో చందన చేయూత ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ అన్నదాన కార్యక్రమాన్ని సందర్శించ స్పందనకు వచ్చే అర్జీదారులకు అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ ప్రతి సోమవారు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కలెక్టరు కార్యాలయంల నిర్వహించే స్పందనకు వచ్చే అర్జీ దారులకు ఉచితంగా అన్నదాన వితరణ చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి మంచి నిర్ణయం తీసుకున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్, చందన చేయూత ట్రస్ట్ చైర్మన్ చందన నాగేశ్వర్ ను కలెక్టరు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అర్జీదారులు తదితరుల పాల్గోన్నారు
Prajavartha Online Telugu News