Breaking News

బాలికల క్రికెట్ పోటీల క్రీడా జ్యోతి వెలిగించిన కలెక్టర్ మాధవీలత

-బాలికల నుంచి గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు
-ఘనంగా ప్రారంభం అయిన రాష్ట్ర స్థాయి బాలికల అండర్ 17 క్రికెట్ పోటీలు

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నేటి బాలల భాగస్వామాన్ని గుర్తించి వారికి అన్ని విధాలుగా చేయూత నివ్వడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని నమ్మిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత పేర్కొన్నారు.

బుధవారం దేవరపల్లి మండలం పల్లంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి అండర్ 17 బాలికల విభాగం క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా కలెక్టర్ డా. మాధవీలత, స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు లు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణ, మౌలిక సదుపాయాలు కల్పన, అదనపు తరగతి గదులను నిర్మిస్తూ మంచి వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు. చదువుకు పేదరికం అడ్డు రాకూడదని లక్ష్యంతో అర్హులైన ప్రతి పిల్లల తల్లుల ఖాతాలో అమ్మఒడి పథకం కింద రు.15 వేల రూపాయలను ప్రతి ఏడాది జమ చేస్తున్నారన్నారు. ఇదే విధంగా విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక వంటి అనేక పథకాలను విద్యార్థుల భవిష్యత్తు కోసం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ దిశగా తమ ప్రతిభ నైపుణ్యాలతో ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా, పెద్ద గా కలలు కనడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారని ఆమె అన్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించండి అనే లక్ష్యాన్ని ఇప్పటి నుంచే విద్యార్థులు అలవర్చుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బోధన కి సంబంధించి అంశాలు,మౌలిక సదుపాయాలు ప్రైవేట్ పాఠశాలలో ఉండవు అనే భావన కలిగించేలా నేడు ప్రభుత్వ స్కూల్స్ తీర్చి దిద్దారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపలేకపోతున్నామన్న భావన తల్లితండ్రులలో కలగకుండా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరిస్తూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారన్నారు. విద్యా కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కొరకు స్వయంగా యూనిఫామ్, స్లాక్స్, షూ ఎంపిక ఎంపిక చేస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చి బాలికల విభాగం లో క్రికెట్ పోటీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పుట్టినరోజున క్రీడా సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు పల్లంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 21,22,23 తేదీల్లో మూడు రోజులు పాటు నిర్వహించే రాష్ట్ర అండర్ 17 బాలికల విభాగపు క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి 250 మంది బాలికలు,100 సిబ్బంది పాల్గొనడం శుభ సూచకమన్నారు. క్రీడల చివరి రోజున ఈ క్రికెట్ లో గెలుపొందిన బాలికలకు ప్రైజెస్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో ప్రథమ స్థానములో నిలిచిన బృందానికి జాతీయస్థాయిలో ఆడేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ట్యాబ్ లను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గనమని జనార్ధనరావు, నియోజకవర్గ ఆటల పోటీల పరిశీలకులు జీవి, నాలుగు మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు, సర్పంచులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *