విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో లక్కీ లక్ష్మణ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన లక్కీ లక్ష్మణ్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా లబ్బీపేట లోని ఒక హోటల్లో చిత్త యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో సోహెల్ మాట్లాడుతూ తాను నటించిన తొలి చిత్రం లక్కీ లక్ష్మణ్ ప్రమోషన్ కార్యక్రమం విజయవాడ నుంచి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. విజయవాడ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రజలు చూపించే ప్రేమ ఆదరణ ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. లక్కీ లక్ష్మణ్ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేమ యాక్షన్ కామెడీ అన్ని అంశాల మిళితమే లక్కీ లక్ష్మణ్ చిత్రం అన్నారు. బిగ్ బాస్ తర్వాత తనకు ఐదు చిత్రాలలో ఆఫర్లు వచ్చాయని అందులో మొదటి చిత్రం లక్కీ లక్ష్మణ్ ఈనెల 30వ తేదీన విడుదల కానుందని చెప్పారు. దర్శకుడు అభి ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీశారని ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చిందని యువతకు కచ్చితంగా ఈ చిత్రం నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. సంగీత దర్శకుడు అణు రూబెన్ అందించిన బాణీలు ఇప్పటికే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చటం సంతోషంగా ఉందని చిత్రంలో పాటలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని తెలిపారు. తాను సినిమాలకు పనికిరానని చెప్పిన వారే ఈ సినిమాలో నా నటన చూసి తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.
తదనంతరం దర్శకుడు అభి మాట్లాడుతూ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన సోహెల్ తో తన మొదటి సినిమా తీశానని ఈ చిత్రం ప్రేక్షకులకు కనువిందు గ్యారెంటీ అని అన్నారు. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్విస్తాయని ఆయన పేర్కొన్నారు. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలతో పాటు పాటలు కూడా ప్రేక్షకులకు తప్పక నచ్చుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సోహెల్ మన పక్కింటి కుర్రోడు లాగా ఉంటాడు ఈ చిత్రంలో కూడా తన క్యారెక్టర్ అలాగే ఉంటుందని చెప్పారు. లక్కీ లక్ష్మణ్ ఈనెల 30న రిలీజ్ కానందుని చిన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో కమెడియన్స్ షాని సాల్మన్, అనురాగ్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News