తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి అర్బన్ లే అవుట్ లలో స్థలాలను పునః పరిశీలన సర్వే కార్యక్రమం సత్వరమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జే సి డి కే బాలాజీ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి సంబంధిత మునిసిపల్ ఇంజినీర్లు, హౌసింగ్ అధికారులు, లే అవుట్ ఇంఛార్జి అధికారులు సర్వేయర్లతో లేఔట్ లో నిర్మాణంలో ఉన్న ఇల్లు, ఇంకను అభివృద్ధి చేయాల్సిన స్థలం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం. కొత్తపల్లి, చిందేపల్లి, సూరప్పకాశం, కల్లూరు, జి పాలెం లే అవుట్ లలో ఉన్న మొత్తం స్థలం, వాటిలో ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగిస్తున్న, పబ్లిక్ ఉపయోగానికి వినియోగించే స్థలం తదితర అంశాలపై సమీక్ష చేస్తూ మాట్లాడుతూ లేఔట్ లో ఉన్న స్థలం ను మరింతగా ఉపయుక్తంగా వాడేందుకు పునః పరిశీలన చేసి మళ్ళీ పూర్తి లేఔట్ సర్వే సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. ఇందులో సంబంధిత ఆర్డీఓ లు, మునిసిపల్ అధికారులు, లేఔట్ ఇంఛార్జి లు, రెవెన్యూ అధికారులు, పంచాయితీ రాజ్ ఇంజనీర్లు, స్థానిక సర్వేయర్ల తో కలిసి టీమ్ గా వెళ్లి రెండు రోజుల్లోపు పూర్తి చేసి పూర్తి స్థాయి నివేదికలతో బుధవారం జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీఓ లు కనక నరస రెడ్డి, హౌసింగ్ ఇన్చార్జి పిడి శ్రీనివాస ప్రసాద్ హౌసింగ్ ఈ ఈ చంద్ర శేఖర్ బాబు, డిప్యూటీ కమిషనర్ చంద్ర మౌళీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …