Breaking News

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి

-నేటి స్పందన కు 145 అర్జీలు: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో డి ఆర్ ఓ యం.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏ.ఓ జయరాములు తో కలసి కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు.

మొత్తం : 145 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 111 , డిసిహెచ్ఎస్ కు సంబంధించి 7,డియం & హెచ్ ఓ కు సంబంధించి 4,మున్సిపల్ కమిషనర్ కు సంబంధించి 2,పంచాయతీ కి సంబంధించి 7,విద్యా శాఖ కు సంబంధించి 4,ఉపాధి కల్పన శాఖకు సంబంధించి 1,విద్యుత్ శాఖ కు సంబంధించి 1,పోలీసు శాఖ కు సంబంధించి 4,జడ్పీ కి సంబంధించి1,డిఆర్డీఏ కి సంబంధించి 1,ఎస్ ఆర్ ఓ కు 1,ఏ పి ఓ ఎస్ ఎస్ ఏ శాఖ కు 1,రావడం జరిగిందని,
రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు ఈ అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *