Breaking News

కోవిడ్ నియంత్రణకు నోడల్ ఆఫీసర్లు

-రెండు రోజుల్లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు కావాలి
-50 బెడ్లతో ఒక కోవిడ్ కేర్ సెంటర్ సత్వరమే ఏర్పాటు చేయాలి: కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్19 కు సంబంధించి వివిధ అంశాలపై నియమించబడిన నోడల్ ఆఫీసర్లు బాధ్యత తో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనందరి పై ఉందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వి సి హాల్ నందు డి యం & హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి, డి సి హెచ్ ఎస్ ప్రభావతి లతో కలసి కోవిడ్19 ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధత లో భాగంగా ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 కు సంబంధించి నియమించిన నోడల్ ఆఫీసర్లు బాధ్యత తో పనిచేసి కోవిడ్ బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపడవలసిన బాధ్యత ఉందని, ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలు వాటిపై సత్వర చర్యలు కొరకు కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలని డి యం & హెచ్ ఓ ను ఆదేశించారు.

అలాగే సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆక్సిజన్ పైపు లైన్ లు పరిశీలించి పూర్తి స్థాయిలో పనిచేసేలా చేపట్టి నివేదికను అందజేయాలని ఏ పి యం ఐ డిసి ఈఈ ని ఆదేశించారు. రేపు 10 సి హెచ్ సి, 2 ఏరియా ఆస్పత్రిలో, రుయా, స్విమ్స్, ఈఎస్ఐ, టీచింగ్ ఆసుపత్రిలో మొత్తం 15 కేంద్రాలలో రేపు మాక్ డ్రిల్ లో భాగంగా 75 కాలంలతో కూడిన ఫార్మాట్ లో సమాచారంతో పూర్తి స్థాయిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 50 బెడ్లు అందుబాటులో వుండే విధంగా ఒక కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డియం &హెచ్ ఓ ను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మూడు షిఫ్టులుగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీ అందరి వైద్య సిబ్బంది అధికారులు అప్రమత్తతతో కోవిడ్ 19 ను అరికట్టడంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో కంకణ బద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి యం & హెచ్ ఓ లు డాక్టర్ సులోచన, డాక్టర్ సుధారాణి, డాక్టర్ యుగంధర్,డి ఐ ఓ డాక్టర్ శాంత కుమారి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, ఎస్ వి ఆర్ ఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, స్విమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, డాక్టర్ కిరణ్ నాయక్ ఏ పి యం డి ఐ సి, ఈ ఈ దనంజయ రెడ్డి డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *