Breaking News

ద్వైవార్షిక నవరత్నాలు సంక్షేమ పథకాలు జిల్లాలో నేడు 18300 మందికి రూ. 22.90 కోట్లు లబ్ది : కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 2022-23 రెండవ విడత జనవరి మాసంలో సంక్షేమ క్యాలెండర్ మేరకు ప్రతి సంవత్సరం 6 మాసాల్లో అర్హత కలిగిన లబ్ధిదారులకు, అర్హులైన ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదన్న స్ధిర సంకల్పంతో, అర్హులై ఉండి పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి 2,79,065 మంది లబ్ది దారులకు రూ. 590.91 కోట్లను నేడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో గౌ. ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో జమచేయగా తిరుపతి నుండి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, పథక సంచాలకులు డి ఆర్ డి ఎ. జ్యోతి మరియు సంబంధిత అధికారులు, లబ్దిదారులతో కలిసి మంగళవారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొరపాటున ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారు పథకం లబ్ధి అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని వెరిఫై చేయించి అర్హులైన వారికి డిసెంబర్‌ నుండి మే వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని జూన్‌ నెలలో, జూన్‌ నుండి నవంబర్‌ వరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిని డిసెంబర్‌ నెలలో…ఏ ఒక్కరికీ లబ్ధి అందకుండా ఉండకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు డిస్‌ప్లే చేయడం ద్వారా సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి, పారదర్శకతతో లంచాలు లేకుండా, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావు లేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో పథకాల లబ్ధి ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి, నిర్ధిష్ట సమయంలోనే ఠంచన్‌గా లబ్ధి పంపిణీ చేస్తోందన్నారు.

వివిధ పథకాల క్రింద నేడు జిల్లాలో లబ్ధి పొందిన వారి వివరాలు

వైయస్సార్‌ ఈబీసీ నేస్తంలో నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 48, పొందిన లబ్ధి రూ. 7.20 లక్షలు.

జగనన్న చేదోడు నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 24, పొందిన లబ్ధి రూ. 2.40 లక్షలు.

వైయస్సార్‌ మత్స్యకార భరోసా నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 65, పొందిన లబ్ధి రూ. 6.50 లక్షలు.

జగనన్న విద్యాదీవెన నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 13,146, పొందిన లబ్ధి రూ. 15.72 కోట్లు.

జగనన్న వసతి దీవెన నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 820, పొందిన లబ్ది రూ. 68.74 లక్షలు.

జగనన్న అమ్మ ఒడి నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 1754, పొందిన లబ్ధి రూ. 2.28 కోట్లు.

వైయస్సార్‌ కాపు నేస్తంలో నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 430, పొందిన లబ్ధి రూ. 64.50 లక్షలు.

వైయస్సార్‌ వాహనమిత్ర నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 518, పొందిన లబ్ధి రూ. 51.80 లక్షలు.

వైయస్సార్‌ చేయూత నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 1297, పొందిన లబ్ధి రూ. 2.432 కోట్లు.

వైయస్సార్‌ నేతన్న నేస్తంలో నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 141, పొందిన లబ్ధి రూ. 33.84 లక్షలు.

డా. వైయస్సార్‌ ఉచిత పంటల బీమా నేడు లబ్ధి అందుకున్న వారి సంఖ్య 57, పొందిన లబ్ధి రూ. 11.91 లక్షలు.

జిల్లాలో మొత్తం నేడు సంక్షేమ పథకాల లబ్ధి అందుకున్న వారి సంఖ్య 18300, పొందిన లబ్ధి రూ. 22.90 కోట్లు.

జిల్లాలో ప్రతి ఒక్క అర్హులకు పెన్షన్ కానుక అందుతుందని, నోటీస్ లు అందిన వారికి వెరిఫికేషన్ జరుగుతోందని అన్నారు. ఇందులో అపోహలు వద్దన్నారు.

అనంతరం లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ మెగా చెక్కులు పంపిణీచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి యుగంధర్, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్, వ్యవసాయ చేనేత మత్స్య సంబందిత శాఖల అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *