Breaking News

పారదర్శకంగా పధకాల అమలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లంచాలకు తావులేకుండా పారదర్శకంగా పధకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్ 80,79 వ సచివాలయం ప్రాంతంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ లను ప్రవేశపెట్టి అవినీతికి, లంచాలకు తావులేకుండా అర్హత ఉంటే చాలు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మిగతా రాష్ట్రాల వారు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకొనే విధంగా జగన్ గారు పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం లో అర్హత లేకున్నా సరే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందించారని,నేడు అలాంటి వాటిని పరిశీలిస్తుంటే టీడీపీ వారు గోరంతను కొండకంతలుగా చేసి అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. అనుకూల మీడియా ఉంది కదా అని వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అని ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అవినాష్ భరోసా ఇచ్చారు. అర్హత ఉంటే ఎవరికి సంక్షేమ పథకాలు, పెన్షన్లు తొలగించారు అని హామీ ఇచ్చారు. ఈ డివిజన్ లో గత మూడేళ్ళుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అందుబాటులో తేవడం జరిగిందని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, నాగవంశ కార్పొరేషన్ డైరక్టర్ ఎర్నేటి సుజాత వైసిపి నాయకులు కాశీ, తాజుద్దీన్, వెంకటేశ్వరావు, తిరుపతిరెడ్డి, సుధాకర్, దామోదర్, గీతా కుమారి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *