Breaking News

విద్యా విజ్ఞానం శాశ్వతమైనది.. ఉజ్వలమైన భవిష్యత్తు చదువు ద్వారానే లభిస్తుంది… : మంత్రి జోగి రమేష్

గూడూరు, కృత్తివెన్ను, పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా, విజ్ఞానం శాశ్వతమైనదని వీటి ద్వారానే మాత్రమే విద్యార్థిని విద్యార్థులు చదువు ద్వారానే ఉజ్వలమైన అభివృద్ధిపథం లోకి పయనిస్తారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు.
శుక్రవారం ఉదయం ఆయన తొలుత పెడన నియోజవర్గం గూడూరు గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ సన్నిదాన సమావేశ మందిరంలో గూడూరు మండల పరిధిలోని 7 ప్రాథమిక, ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 445 మంది విద్యార్థినీ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ చేశారు. అనంతరం, మంత్రి కృత్తి వెన్ను మండలంలో 6 ప్రాథమిక పాఠశాలలు,11 ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి 493 మంది ఎనిమిదవ తరగతి బాలికలకు లక్ష్మిపురం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్యాబులను అందజేశారు. అలాగే సాయంత్రం పెడన రూరల్ బల్లిపర్రు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో 76 మంది విద్యార్థునులకు మంత్రి జోగి రమేష్ ట్యాబులను అందజేశారు
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,పాఠశాల విద్యలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టెరని,ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల బోధనలో మరో కొత్త శకం ఆరంభమైందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా సమగ్ర కార్యాచరణ రూపొందించబడిందని పేర్కొన్నారు.
చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం సమాజంలో అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న వారికి ట్యాబ్‌లు అందజేస్తున్నామని చెప్పారు. వాళ్లంతా 2025 విద్యా సంవత్సరం నాటికి 10వ తరగతి పరీక్షలు రాసేసమయానికి సుశిక్షితులు చేసేందుకు ఈ ట్యాబులు ఉపయోగపడుతాయని అన్నారు. వీరికి చదవులు చెప్తున్న టీచర్లకు కూడా ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు.26 జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉన్నవారందరికీ ప్రభుత్వం ట్యాబులు ఇస్తుందన్నారు. 8వ తరగతిలో వచ్చే ప్రతి పిల్లాడికీ ఇచ్చే బైజూన్ ట్యాబులో ఇంగ్లిషులోనూ, తెలుగులోనూ సబ్జెక్టులు ఉంటాయని బాగా అర్థం కావడానికి అన్ని భాషల్లో పాఠాలు ఉంటాయిన్నారు. ట్యాబ్‌ల కారణంగా ఎంతో మేలు జరుగుతుందని సులవుగా పాఠాలు అర్థం అయ్యేందుకు ట్యాబ్‌లు ఉపయోగపడతాయిన్నారు. ట్యాబ్‌ల బైజూస్‌ కంటెంట్‌ సులభతరంగా అర్థంచేసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు. సెక్యూర్డ్‌ డిజిటల్‌ కార్డు కూడా ట్యాబుల్లో ఉంటుందని ఇంటర్నెట్‌ లేకపోయినా ఆఫ్ లైన్‌లో కూడా ఈ ట్యాబుల ద్వారా పాఠాలు వినే అవకాశం ఉంటుందని మంత్రి జోగి రమేష్ వివరించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు చెందిన పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అందజేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు
సమాజంలో తమ పిల్లలు అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు ఆశిస్తారని, బాధ్యతగా చదువుకోవాల్సిన పని పిల్లలదే అన్నారు. రోజులో కనీసం ఒక గంట సేపైనా దగ్గరుండి చదివించాలన్నారు. శ్రద్ధగా చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులను ఎంతటి గొప్ప చదువు నైనా చదివించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వారిని ఎంతో ప్రోత్సహించడానికి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమాల్లో గూడూరు సర్పంచ్ లింగం సులోచన రాణి, ఎంపీటీసీ నాగలక్ష్మి, గూడూరు ఎంపీపీ సంగా మధుసూదన రావు, గూడూరు జడ్పిటిసి వేముల సురేష్, కృత్తివెన్ను ఎంపీపీ కోనసాని గరుడ ప్రసాద్, కృత్తివెన్ను జెడ్పిటిసి మైలా రత్నకుమారి, పెడన నియోజకవర్గ వైయస్సార్సీపి పార్టీ పరిశీలకులు తన్నీరు నాగేశ్వరరావు, వైయస్సార్ పార్టీ అధ్యక్షులు గొర్రెపర్తి రవికుమార్, వైయస్సార్సీపి పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోటేపల్లి రత్నకరరావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చారుమతి రామానాయుడు, గూడూరు రైతు భరోసా చైర్మన్ వర్ణం శ్రీ మహాలక్ష్మి నాయుడు, గూడూరు ఎండిఓ వి.వి. సుబ్బారావు, గూడూరు తహసిల్దార్ విజయ్ కుమార్, గూడూరు మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ సత్యనారాయణ, కృత్తివెన్ను తహసిల్దార్ బి. రామకోటేశ్వర రావు,కృత్తివెన్ను ఎండిఓ గుంజా పిచ్చిబాబు, ఎంఈవో ప్రసాద్ , గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు పుష్పలత, మల్లవోలు జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పాండురంగారావు పలువురు అధికారులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *