Breaking News

బడి ఈడు పిల్లలు బడిలోనే…

-జిల్లాలో 5975 మంది డ్రాప్ అవుట్ గా గుర్తింపు..
-2402 మంది పాఠశాలలో తిరిగి చేరిక..
-మిగిలిన విద్యార్థులను సైతం బడిలో చేర్పించండి..
-కలెక్టర్ ఢిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. మధ్యలో బడి మానివేసిన (డ్రాప్ అవుట్) పిల్లలకు సంబంధించి శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ నుండి గూగుల్ కాన్ఫెరెన్స్ ద్వారా రెవిన్యూ, విద్యా శాఖాధికారులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి బయట పిల్లలు బడిలోనే ఉండాలని ఇందుకు పాఠశాలల స్థాయిలో బడిమానివేసిన వారి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలన్నారు. జిల్లాలో నేటివరకూ 5975 మంది బడిబయట పిల్లలు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. వీరిలో జిల్లాలోని 15 మండలాల్లో 2402 మందికి పైగా విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం జరిగిందని మిగిలిన వారిని కూడా బడిలో చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. డ్రాప్ అవుట్ అయిన ప్రతీ విద్యార్దీ పాఠశాలలో తిరిగి చేరి విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రాప్ అవుట్ లకు సంబంధించి ఇంకనూ వివరాలు నమోదు చేయని జగ్గయ్యపేట, విజయవాడ రూరల్ మండలాల అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ, తక్షణమే నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత డ్రాప్ అవుట్ లోని 1961 మంది వివిధ కారణాలతో పిల్లలను గుర్తించలేక పోయామని అయినప్పటికీ మరొక్కసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 14 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న 381 మంది వివరాలను పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఇంటిలోని చిన్న పిల్లల ఆలనా, పాలనా చూసేందుకు గాను బడి మానివేశారని వీరిని కూడా పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో 56 మంది బడి మానివేసిన విద్యార్థులు తిరిగి బడిలో చేరేందుకు అనాసక్తత కనబరచడం జరిగిందని వీరిలో 43 మంది కంచికచర్ల లోనే ఉన్నారని, అవసరం అయితే కార్మిక, ఇతర శాఖాధికారులతో సమన్వయం చేసుకుని బడిలో చేర్పించాలన్నారు. విస్సన్నపేట మండలం వేమారెడ్డిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుకుంటూ రవాణా సౌకర్యం లేక మానివేసిన విద్యార్థికి తక్షణమే రవాణా సదుపాయం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన 22 మంది విద్యార్థులను భవిత, మేడోనా, విజయ మేరీ వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 25 మంది అనారోగ్య కారణాలతో బడి మానివేసిన విద్యార్థులను గుర్తించి వారి అనారోగ్య వివరాలను పరిశీలించి వారి అనారోగ్య శాతాన్ని బట్టి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గూగుల్ కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ తో పాటు డి.ఈ.ఓ. సి.వి. రేణుక, డిప్యూటీ డి.ఈ.ఓ. కె. రవికుమార్, మండల విద్యా శాఖాధికారులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *