-జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి తొలి దశ భూసేకరణ ప్రక్రియ మరో వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని పలు శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన తన చాంబర్ లో మచిలీపట్నం పోర్టు నిర్మాణకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, ఏపీ మారిటైం బోర్డు ఆదేశించిన మేరకు మూడు దశల్లో పోర్టుకు కావాల్సిన 3,400 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. తొలి దశలో 1730. 32 ఎకరాలకు సంబంధించిన సరిహద్దులు నిర్ధారించాలని, ఇప్పటికే కోర్టుకు అడ్వాన్స్ పొజిషన్ సమర్పించినట్లు ఆయన తెలిపారు. పోర్టు ల్యాండ్ పరిధిలో ఉన్న భూముల్లో ప్రస్తుతం వేరుశనగ పంట ఉందని కాయతీత తర్వాత, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆ తదుపరి పంటలను సాగు చేయకుండా కట్టడి చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేటు భూముల యజమానులకు నష్టపరిహారం ఎంత చెల్లించాలనేది అంచనా వేసి పంపించాలన్నారు. వారికి ఏమైనా నోటీసులు ఇవ్వాలంటే త్వరితగతిన తాసిల్దార్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన భూములను సేకరించాలన్నారు. ఆర్డర్ తర్వాత వారికి డబ్బులు వెనక్కి ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు.
రహదారుల అనుసంధానికి ప్రివ్యూ నోటిఫికేషన్ సంబంధించి ముడా కొనుగోలు చేసిన భూములలొనే 3.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోతేపల్లి, చిలకలపూడి మంగినపూడి, కరగ్రహారం మీదుగా కొనసాగి రోడ్డు గత ప్రభుత్వంలో నిర్మించిన పైలాన్ సమీపంలోని ఐస్ ఫ్యాక్టరీ మధ్యలో నుండి ఈ రహదారి కొనసాగుతుందన్నారు. జనవరి 10వ తేదీలోపు నిర్దేశించిన మ్యాపును స్పష్టంగా వివిధ రంగుల్లో చిత్రీకరించి తనకు అందజేయాలని ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు
ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ముడా వైస్ చైర్మన్ బి.శివ నారాయణరెడ్డి, మ్యారి టైం బోర్డు డైరెక్టర్ విద్యాశంకర్, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్‌బాబు, జిల్లా ల్యాండ్ రికార్డ్స్ సూపర్డెంట్ రాధిక, ముడా, మ్యారీటైం బోర్డు, జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.