తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎం.ఎల్.సి.గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై డిసెంబర్ 30 న ప్రకటించి వాటిలో రాజకీయపార్టీలు అభ్యంతరాలు తెలపవచ్చని , నమోదుకు కూడా అవకాశం వుందని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం సాయత్రం స్థానిక కలెక్టరేట్ లో ప్రకటించిన గ్రాడ్యుయేట్, ఉపాద్యాయ ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో ఇ ఆర్ఓ , ఎయి ఆర్ ఓ లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో రాజకీయ పార్టీలు సూచించిన అభ్యతరాలను జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజి అద్యక్షతన కమిటీ ఏర్పాటు చేసామని అన్నారు. అర్హతలేని గ్రాడ్యుయేట్ ఓటర్లను 3297 మందిని గుర్తించి తొలగించామని అన్నారు. ఉపాద్యాయ ఓటర్లగా నమోదు చేసుకున్న వారు జిల్లా విద్యాశాఖ అధికారి దృవీకరణ చేసినవని, ఉపాద్యాయ ఓటర్లను పరిశీలించాలనే నేడు రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తామని అన్నారు. గతంలో ఇచ్చిన వినతిని స్వీకరించి పరిశీలించి అనర్హులను తొలగించినందుకు ధన్యవాదాలని రాజకీయ పార్టీల నేతలు హర్హం వ్యక్తం చేసారు.
జిల్లాలో 30.12.2022 నాటికి ప్రకటించిన గ్రాడ్యుయేట్ ఓటర్లు వివరాలు నియోజకవర్గం వారిగా
120-గూడూరు (ఎస్.సి.) : 13192, 121-సూళ్ళూరు పేట (ఎస్.సి.): 12186, 122-వేంకటగిరి (పార్ట్ ): 6613, 166-చంద్రగిరి : 14405, 167-తిరుపతి : 21383, 168-శ్రీకాళహస్తి :11326, 169-సత్యవేడు (ఎస్.సి.): 7801, 170- నగరి (పార్ట్ ): 3763 మొత్తం : 90669 ఓటర్లు .
జిల్లాలో 30.12.2022 నాటికి ప్రకటించిన ఉపాద్యాయ ఓటర్లు వివరాలు నియోజకవర్గం వారిగా
120-గూడూరు (ఎస్.సి.) : 1016, 121-సూళ్ళూరు పేట (ఎస్.సి.): 913, 122-వేంకటగిరి (పార్ట్ ): 333, 166-చంద్రగిరి : 908, 167-తిరుపతి : 1825, 168-శ్రీకాళహస్తి :610, 169-సత్యవేడు (ఎస్.సి.):277, 170- నగరి (పార్ట్ ): 371 మొత్తం : 6,253 ఓటర్లు .
ఈ సమావేశంలో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, డి ఆర్ ఓ శ్రీనివాసరావు , అర్దిఒ కనకనరసా రెడ్డి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు, ఎన్నికల సూపరిన్ టెన్ డెంట్ పరమేశ్వర స్వామి, అర్బన్ తహసిల్దార్ వెంకటరమణ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలు ఐ ఎన్ సి ప్రమీలమ్మ, వెంకట నరసింహులు, సి పి ఎం కందారపు మురళి , తెలుగుదేశం మనోహరాచారి, సి పి ఐ మురళి , బిజెపి వరప్రసాద్ , ఎన్నికల డి టి విజయభాస్కర్ , ఎ ఇ ఆర్ ఓలు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …