గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆయా కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలని, సచివాలయాల్లో కార్యదర్శుల పనితీరు, స్థానిక సమస్యల పై ప్రతి సోమవారం నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయనున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో స్పందన, సచివాలయ కార్యదర్శులతో జూమ్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జూమ్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయం పరిధిలో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి సేవకు అందే అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. సచివాలయాల్లో కార్యదర్శుల పనితీరు మెరుగుపడాలని, ప్రతి సోమవారం నోడల్ అధికారులతో ప్రత్యేకంగా సచివాలయ కార్యదర్శుల పనితీరు, సేవలు, స్థానిక సమస్యలు తదితర అంశాల పై సమీక్షా సమావేశం పెట్టాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో జాతీయ స్థాయిలో గుంటూరు నగరం మొదటి స్థానంలో నిలవడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. రానున్న కాలంలో ఆస్తి పన్ను నూరు శాతం వసూళ్లు చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని అడ్మిన్ కార్యదర్శులను, స్వచ్చ సర్వేక్షణ్ 2023లో భాగంగా శానిటేషన్ కార్యదర్శులు సచివాలయం పరిధిలో హోం, క్లస్టర్ కంపోస్ట్ తయారి పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బహిరంగ మల విసర్జన లేకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేసే షాప్స్ ని సీజ్ చేయాలన్నారు. ప్లానింగ్ కార్యదర్శులు రెండు రోజుల్లో ఎల్.ఆర్.ఎస్.ప్యాట్రన్ లను అప్ లోడ్ చేయాలని, ఎమినిటి కార్యదర్శులు పాట్ హోల్స్ ని యాప్ లో పొందుపరచాలని, త్రాగునీటి శ్యాంపిల్స్ లో ప్రతి రోజు క్లోరిన్, హెచ్.2ఓ టెస్ట్ లు చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు జరిగే స్పందనలో కార్యదర్శులు అందరూ ఉండాలన్నారు.
అనంతరం కమిషనర్ గారు గతవారం స్పందన ఫిర్యాదులు, స్పందన పోర్టల్, ఈ.ఆర్.పి., వాట్స్ అప్, కాల్ సెంటర్ల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారం పై అధికారులతో, సంబందిత కార్యదర్శులతో సమీక్షించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం వహించవద్దని, నిర్దేశిత గడువులోగా ఫిర్యాదులు, అర్జీలు పరిష్కరించాల్సిన భాద్యత విభాగాధిపతిదేనని తెలిపారు.
సోమవారం నిర్వహించిన స్పందనలో 60 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 14, ఇంజినీరింగ్ విభాగం 18, ప్రజారోగ్య విభాగం 8, రెవెన్యూ విభాగం 14, ఉపా సెల్ 2, పరిపాలన విభాగం 3, అకౌంట్స్ విభాగం కి సంబధించి 1 ఫిర్యాదు అందాయని, ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ మూర్తి, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, ఎంహెచ్ఓ. డాక్టర్ భాను ప్రకాష్, మేనేజర్ శివన్నారాయణ, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు, ఈ.ఈ లు, యస్.యస్, సూపరిండెంట్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News