Breaking News

ఆర్థికాభివృద్ధికి విద్య బలమైన సాధనం: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

-450 మంది విద్యార్థులకు రూ.18 లక్షల ఉపకారవేతనాలు పంపిణీ
-కౌండిన్య ఐఎఎస్ అకాడమీని ప్రారంభించిన గవర్నర్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ సమాజమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యంత బలమైన సాధనమని, విద్య, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామం కౌండిన్యపురంలో సోమవారం నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఎఎస్ అకాడమీని గవర్నర్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి విద్యాధికునిగా మారినప్పడు గణనీయమైన ఆదాయార్జనతో పేదరికం నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు.

కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలలో సుమారు 4,500 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.96 లక్షల ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో అర్హులైన బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఔత్సాహిక విద్యార్థులకు మేలు చేకూర్చుతుందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ట్రస్టు వ్యవస్ధాపకులు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఇ.వి. నారాయణ, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అదనపు కమిషనర్ వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *